కోలీవుడ్ స్టార్ యాక్టర్ ఇలయదళపతి విజయ్ హీరోగా స్నేహా, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ది గోట్. ఈ మూవీలో ప్రభు దేవర, ప్రశాంత్, ప్రేమ్ జి, లైలా మోహన్ తదితరులు కీలక పాత్రలు పోషించగా ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ పై ఈ మూవీని అర్చనా కలపతి గ్రాండ్ లెవెల్లో నిర్మించారు.
యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ మూవీ ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా తమిళనాడులో ది గోట్ మూవీ బాగా కలెక్షన్ ఆర్జించగా తెలుగులో మాత్రం ఆశించిన స్థాయిలో రాబట్టలేకపోయింది. అలానే కేరళ లో కూడా ది గోట్ మూవీ చతికిలపడిందని చెప్పాలి. విజయ్ డ్యూయల్ రోల్ పోషించిన ఈ మూవీ యొక్క టోటల్ వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్ డీటెయిల్స్ క్రింద ఇవ్వబడ్డాయి.
- తమిళనాడు – రూ. 220 కోట్లు
- ఓవర్సీస్ – రూ. 157 కోట్లు
- కర్ణాటక – రూ. 28 కోట్లు
- కేరళ – రూ. 13.5 కోట్లు
- ఏపీ/టిజి – రూ. 12.5 కోట్లు
- రెస్ట్ ఆఫ్ ఇండియా – రూ. 24 కోట్లు
- టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ – రూ. 455 కోట్లు
- బ్రేక్ ఈవెన్ మార్క్ – రూ. 400 కోట్లు
ఫలితం – హిట్