ఇలయదళపతి విజయ్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ది గోట్. ప్రేమ్ జి, ప్రశాంత్, ప్రభుదేవా, వైభవ్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ మూవీకి యువన్ శంకర్ రాజా సంగీతం అందించగా ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ పై అర్చన కలపతి గ్రాండ్ లెవెల్లో నిర్మించారు.
ఇక ఇటీవల మంచి అంచనాలతో అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇక మొదటి రోజు బాగానే ఓపెనింగ్స్ రాబట్టిన ఈ మూవీ తమిళనాడులో మాత్రం బాగా పెర్ఫార్మ్ చేస్తోంది. విజయ్ కి అక్కడ అన్ని వర్గాల ఆడియన్స్ లో క్రేజ్ కారణంగా మూవీ బాగానే కలెక్షన్ రాబడుతున్నట్లు చెప్తున్నారు ట్రేడ్ పండితులు. అయితే విషయం ఏమిటంటే, ది గోట్ మూవీ ఓవర్సీస్ లో ఓపెనింగ్ ప్రీమియర్స్ పరంగా 5.7 మిలియన్స్ రాబట్టగా రెండవ రోజు 3 మిలియన్స్, మూడవ రోజు 3.5 మిలియన్స్ రాబట్టింది.
మొత్తంగా ఇప్పటికే ఈ మూవీ గడచిన మూడు రోజుల్లో ఓవర్సీస్ లో రూ. 100 కోట్ల గ్రాస్ రాబట్టడం విశేషం. ఆ విధంగా మొత్తం ఈ మూవీ 12 మిలియన్స్ అందుకోగా బ్రేకివెన్ చేరుకోవాలి అంటే 16 మిలియన్స్ రావాలి. అది ఈ మూవీకి పెద్ద కష్టమేమి కాదని తెలుస్తోంది. ఓవరాల్ గా ది గోట్ మూవీ అక్కడ 20 మిలియన్స్ వరకు చేరుకునే అవకాశం కూడా లేకపోలేదు.