ఇలయదళపతి విజయ్ హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ది గోట్. ఈ మూవీని ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అర్చన కలపతి గ్రాండ్ లెవెల్లో నిర్మించగా యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.
ప్రశాంత్, ప్రభు దేవ, వైభవ్, స్నేహ, లైలా తదితరులు కీలక పాత్రలు చేసిన ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించారు. ఇక ఇటీవల మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ ఫస్ట్ డే యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఓపెనింగ్స్ పరంగా బాగానే రాబట్టిన ది గోట్ మూవీ 2వ రోజు వరల్డ్ వైడ్ రూ. 55 కోట్లు రాబట్టింది.
అందులో టోటల్ ఇండియా నుండి రూ. 29 కోట్లు ఉండగా ఓవర్సీస్ నుండి రూ. 25 కోట్లు ఉన్నాయి. మొత్తంగా రెండు రోజుల్లో ది గోట్ మూవీ రూ. 156 కోట్ల గ్రాస్ ని సొంతం చేసుకుంది. అయితే గోట్ మూవీకి తమిళనాడుతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన స్థాయి రెస్పాన్స్ మాత్రం లభించడం లేదు. మరి రాబోయే రోజల్లో ఈ మూవీ ఇంకెంతమేర రాబడుతుందో సి చూడాలి.