ఇలయదళపతి విజయ్ హీరోగా వెంకట్ ప్రభు తీసిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ది గోట్ ( గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం). ఈ మూవీలో యువ నటి మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించగా ముఖ్య పాత్రల్లో స్నేహ, లైలా, ప్రభుదేవా, వైభవ్, ప్రశాంత్ కనిపించారు. మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ది గోట్ మూవీ ఇటీవల పలు భాషల ఆడియన్స్ ముందుకి వచ్చి యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుంది.
అయితే తెలుగు రాష్ట్రాలు, కేరళ లలో డిజాస్టర్ గా కొనసాగుతున్న ఈ మూవీ తమిళనాడు, ఓవర్సీస్ లలో బాగా కలెక్షన్ రాబడుతోంది. ముఖ్యంగా ఈ మూవీలో రెండు పాత్రల్లో విజయ్ నటన పై మంచి ప్రసంశలు అయితే అందుతున్నాయి. ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించిన ఈ మూవీకి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.
విషయం ఏమిటంటే, ఈ మూవీలోని క్లైమాక్స్ సీన్ అందరినీ ఆకట్టుకుంటుండగా దీనిని 2018 లో వచ్చిన హాలీవుడ్ మూవీ ‘ఫైనల్ స్కోర్’ నుండి కాపీ చేసినట్లు కొందరు నెటిజన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే అందులో ఫుట్ బాల్ స్టేడియం ఉండగా ఇందులో దాని ప్లేస్ లో క్రికెట్ స్టేడియంతో తీసారని అంటున్నారు. మరి దీని పై ది గోట్ మేకర్స్ నుండి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.