కోలీవుడ్ స్టార్ యాక్టర్ ఇలయదళపతి విజయ్ హీరోగా మీనాక్షి చౌదరి, స్నేహా హీరోయిన్స్ గా తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన మూవీ ది గోట్. ఈ మూవీని వెంకట్ ప్రభు తెరకెక్కించగా యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. విజయ్ డ్యూయల్ రోల్ పోషించిన ఈ మూవీ ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుంది.
కోలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ విలన్ గా నటించిన ఈ మూవీలో ప్రశాంత్, ప్రభుదేవా, వైభవ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు చేసారు. అయితే ఫస్ట్ డే నుండి తమిళనాడులో ది గోట్ మూవీ మంచి కలెక్షన్ రాబడుతోంది. కాగా మ్యాటర్ ఏమిటంటే, తాజాగా ఈ మూవీ తమిళనాడులో రూ. 200 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరింది.
కాగా అంతకముందు అక్కడ పొన్నియన్ సెల్వన్, లియో మూవీస్ రూ. 200 కోట్ల గ్రాస్ ని దాటాయి, వాటి అనంతరం ది గోట్ ఈ ఫీట్ ని చేరుకున్న మూడవ మూవీగా నిలిచింది. కాగా ఇప్పటికే ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ. 430 కోట్లకి పైగా గ్రాస్ ని సొంతం చేసుకోవడం విశేషం. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ మూవీ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. అలానే ఓవర్సీస్ లో సైతం ది గోట్ కి మంచి కలెక్షన్ లభిస్తుండడం విశేషం.