కోలీవుడ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ మరియు ప్రతిభావంతులైన దర్శకుడు లోకేష్ కనగ రాజ్ ల కాంబో ప్రస్తుతం సౌత్ ఇండియన్ సినిమాలో భారీ హైప్‌ని పొందుతున్న అనేక సంచలన కాంబోలలో ఒకటి. ఈ క్రేజీ కాంబినేషన్‌లో, “మాస్టర్” చిత్రం ఇప్పటికే 2020 లో విడుదలైంది. కాగా ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది మరియు విజయ్‌ని అత్యంత స్టైలిష్ అవతార్‌లో చూపించి, విజయ్ మరియు విజయ్ సేతుపతి కాంబినేషన్‌ని చాలా ఎఫెక్టివ్‌గా హ్యాండిల్ చేసినందుకు దర్శకుడు లోకేష్ మంచి ప్రశంసలు అందుకున్నారు.
ఈ చిత్రం తర్వాత, దర్శకుడు లోకేష్.. లోకనాయకుడు కమల్ హాసన్ తో విక్రమ్ అనే సినిమా చేసారు. కాగా ఈ చిత్రం కమల్ హాసన్‌కు పునరాగమనం హిట్ అవడమే కాక మొత్తం మీద భారీ బ్లాక్‌బస్టర్ అయింది. అలాగే తమిళనాడులో ఇండస్ట్రీ హిట్ గా కూడా నిలిచింది. విక్రమ్ తర్వాత విజయ్, లోకేష్ కాంబినేషన్‌లో ఓ సినిమా ఎనౌన్స్ కావడంతో దాని పై విజయ్ అభిమానులు భారీ అంచనాలు ఏర్పరచుకున్నారు.
ఈ చిత్రంలో నటీనటుల ఎంపిక భారీ స్థాయిలో జరుగుతోంది. తమిళ ఇండస్ట్రీలో విజయ్ బిగ్గెస్ట్ హీరో, లోకేష్ బిగ్గెస్ట్ డైరెక్టర్ కాబట్టి భారీ రికార్డులు క్రియేట్ చేయడానికి ఈ కాంబోనే సరిపోతుంది. దానికి తోడు సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే భారీ బజ్ క్రియేట్ చేయడంలో సినిమా కాస్టింగ్ అద్భుతమయిన పాత్ర పోషిస్తుంది.
ముంబై బేస్డ్ గ్యాంగ్‌స్టర్ సినిమాగా ఈ సినిమా ఉండబోతోందని అంటున్నారు. ఈ సినిమాలో త్రిష, సంజయ్ దత్, గౌతమ్ మీనన్ నటించడం ఇప్పటికే ఖరారు కాగా, ఇప్పుడు ఈ సినిమాలోని నటీనటుల జాబితాలోకి మరో పేరు చేరింది.
హీరో విశాల్ ఈ చిత్రంలో ఒక కీలక పాత్రను పోషించే అవకాశం ఉంది మరియు నివేదికల ప్రకారం మరో కీలక పాత్ర కోసం మలయాళ నటుడిని ఎంపిక చేయాలని బృందం యోచిస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం విజయ్ వారిసు సినిమాలో నటిస్తున్నారు. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇటీవలే మహేష్ బాబుతో ‘మహర్షి’వంటి సూపర్‌హిట్ అందించిన వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వారిసు స్క్రీన్‌ప్లేను వంశీ పైడిపల్లి, హరి, అహిషోర్ సోలమన్ సంయుక్తంగా రాశారు.
ఈ చిత్రంలో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుండగా.. ఇతర ముఖ్య పాత్రల్లో ప్రభు, శరత్‌కుమార్, షామ్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, యోగి బాబు, జయసుధ మరియు సంగీత క్రిష్ తదితరులు ఉన్నారు. వారిసు చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని సంక్రాంతి 2023 కానుకగా తెలుగు తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు.