Homeసినిమా వార్తలుAgent: ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేయని ఏజెంట్ టీం

Agent: ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేయని ఏజెంట్ టీం

- Advertisement -

అఖిల్ అక్కినేని ఏజెంట్ సినిమా రిలీజ్ డేట్ ఏప్రిల్ 28 అని ఖరారు చేశారు కానీ ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్న చిత్ర బృందం సినిమా కంటెంట్ ను ఓవర్సీస్ కి డెలివరీ చేయలేదని సమాచారం. వీలైనంత త్వరగా కంటెంట్ ను అందించేందుకు చిత్ర బృందం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం ఇలాగే కొనసాగితే రేపు రాత్రి విడుదల కానున్న ఓవర్సీస్ ప్రీమియర్ల పై ప్రభావం పడే అవకాశం ఉంది.

మొదట్లో ఏజెంట్ సినిమా మంచి హైప్ తో ప్రారంభమైంది. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకుడు కావడంతో అక్కినేని అభిమానులే కాకుండా ఇతర ప్రేక్షకులు కూడా ఈ సినిమాను వెండితెర పై చూసేందుకు ఎంతో ఉత్సాహం చూపారు.

ఇక సినిమా టీజర్ విడుదలయ్యే వరకు ఏజెంట్ చుట్టూ క్రేజ్ కొనసాగింది, టీజర్ కు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, ఏజెంట్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ గా ఉంటుందని హామీ ఇవ్వడంతో ట్రేడ్ వర్గాలు దీని పై భారీ ఆశలు పెట్టుకున్నాయి. అయితే ఏజెంట్ టీం హైప్ ని మెయింటైన్ చేయడంలో సక్సెస్ కాలేకపోయింది. ఇక సినిమా నుండి పాటలు ఒక్కోటి రిలీజ్ అయ్యే కొద్దీ ప్రేక్షకుల్లో సినిమా పై ఆసక్తి తగ్గింది. ఇటీవలే విడుదలైన ట్రైలర్ ఒక రకమైన ఉత్సాహాన్ని కలిగించింది కానీ ఈ సినిమాకు జరుగుతున్న పేలవమైన బుకింగ్స్ చూస్తుంటే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకోవాలంటే స్ట్రాంగ్ టాక్ చాలా అవసరమనిపిస్తోంది.

READ  Agent: రిలీజ్ డేట్ విషయంలో ఏజెంట్ డైరెక్టర్ మరియు ప్రొడ్యూసర్ మధ్య గొడవలు

ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాల పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి అజయ్ సుంకర, పాటి దీపారెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు గా వ్యవహరించారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ చేస్తున్న ఈ చిత్రానికి రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ అందించారు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, బాలీవుడ్ నటుడు డినో మోరియా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సాక్షి వైద్య హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి హిప్ హాప్ తమిళ సంగీతం అందించారు.

Follow on Google News Follow on Whatsapp

READ  Kabzaa: ఓటీటీలో వస్తున్న కన్నడ పాన్ ఇండియా చిత్రం కబ్జా


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories