సాహో మరియు రాధే శ్యామ్ రూపంలో రెండు భారీ పరాజయాలను ఎదుర్కొన్న తర్వాత.. ప్రభాస్ అభిమానులు ఆదిపురుష్ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే కార్టూనిష్ విజువల్ ఎఫెక్ట్స్ కారణంగా ఆదిపురుష్ టీజర్ కు అన్ని వైపుల నుండి పేలవమైన స్పందన లభించింది.
ఆదిపురుష్ నిర్మాతలు మొదట సంక్రాంతికి విడుదల చేయాలని భావించారు, అయితే టీజర్‌కు వచ్చిన రెస్పాన్స్ చూసి, విడుదల తేదీను మార్చవలసి వచ్చింది. అందువల్ల సంక్రాంతికి విడుదలకు సంబంధించి పంపిణీదారులతో మునుపటి ఒప్పందాలకు ఆటంకం ఏర్పడింది.
కాగా కెజిఎఫ్ సిరీస్ తో అందరి దృష్టిని ఆకర్షించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సాలార్ చిత్రంలో ప్రభాస్ నటిస్తున్నారు. ఈ సినిమాలో తమ అభిమాన హీరోని ఆశించిన మాస్ పాత్రలో చూడచ్చని ఆయన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 2023కి వస్తుందని సాలార్ నిర్మాతలు ప్రకటించారు. అయితే తాజాగా ఆదిపురుష్ జూన్‌కి వాయిదా పడడం వల్ల సాలార్ సినిమా మరింత ఆలస్యం కావచ్చని వార్తలు వస్తున్నాయి.
ఈ రోజుల్లో ఇటువంటి జాప్యాలు సర్వసాధారణంగా మారాయి. ముఖ్యంగా పెద్ద సినిమాలు అన్నీ ఒక తేదీని ప్రకటించడం.. ఆ తర్వాత దారుణమైన విజువల్ ఎఫెక్ట్స్ వల్లనో లేదా మరే ఇతర మెరుగుదలల కారణంగా విడుదల తేదీలు మరింత ముందుకు దాటి వేయబడుతున్నాయి.
ఇందువల్ల ఇతర సినిమాల నిర్మాతలు గతంలో ప్లాన్ చేసి ప్రకటించిన సినిమాలకు అనుకున్న సమయానికి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ వ్యవహారం చూస్తుంటే నవతరం దర్శకులు సమయపాలనలో అంత సాధికారత లేనట్లుగా కనిపిస్తున్నారు.
కేవలం మూడు నెలల గ్యాప్‌లో ప్రభాస్ వంటి స్టార్ హీరో రెండు పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద విడుదల చేయడం ఏంటని ప్రభాస్ అభిమానులు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ పేలవమైన ప్లానింగ్‌కు వారు ప్రొడక్షన్ హౌస్‌లను తప్పుబడుతున్నారు.
రెండు సినిమాలకు భారీ అంచనాలు ఉన్నందున మినిమమ్ గ్యాప్ తప్పదనేది సరైన వాదనే. కానీ రెండూ వేర్వేరు జానర్‌లు అనేది కూడా చూడాలి. ఒకటి పౌరాణిక యాక్షన్ మరియు మరొకటి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉండటం రెండు సినిమాలకి కలిసి వచ్చే అవకాశం ఉంది. తమ అభిమాన హీరో అయిన యంగ్ రెబల్ స్టార్‌ని తక్కువ గ్యాప్‌లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలలో చూడటం ప్రభాస్ అభిమానులకు ఒక అదృష్టంగా కూడా చూడవచ్చు.