మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా ప్రస్తుతం మల్లిడి వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ విశ్వంభర. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ విలన్ గా చేస్తుండగా ఆస్కార్ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు.
ఇప్పటికే చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ వాస్తవానికి ఈ పాటికే రిలీజ్ కావలసి ఉంది, అయితే మూవీ యొక్క విజువల్ ఎఫెక్ట్స్ మరింత క్వాలిటీగా రావాలని టీమ్ మరింత వాయిదా వేసింది. కాగా విశ్వంభర మూవీ జులై 24న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది. ఇక ఈ మూవీ నుండి నిన్న హనుమాన్ జయంతి సందర్భంగా రిలీజ్ అయిన రామ రామ సాంగ్ అంతగా ఆకట్టుకోలేదు.
అయితే విషయం ఏమిటంటే, విశ్వంభరలో హీరో చిరంజీవి ఆరుగురు రాక్షసులతో యుద్ధం చేసే పోరాట క్రమం ఒకటి ఉందట. ఈ సన్నివేశం రేపు థియేటర్స్ లో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుందని మరియు మన సినిమాల్లో ఎప్పుడూ చూడని ప్రత్యేక జీవులు, భారీ విజువల్స్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తాయని టాక్. ఇక ఈ సినిమాలో హనుమాన్ ప్రస్తావన చాలా ప్రభావవంతంగా ఉంటుందట. మెగాస్టార్ మార్క్ ఎంటర్టైన్మెంట్ తో పాటు తన మార్క్ టేకింగ్ తో దర్శకుడు వశిష్ట ఈ మూవీని అద్భుతంగా తీస్తున్నట్లు చెప్తోంది టీమ్.