టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప 2 పై రోజు రోజుకు అందరిలో భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోతున్నాయి. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుండగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఫహాద్ ఫాసిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచారాలు చిత్రాలు అన్ని కూడా ఆడియన్స్ ని ఆకట్టుకుని మూవీ పై మరింత హైప్ ఏర్పరిచాయి. విషయం ఏమిటంటే పుష్ప 2 మూవీలో కీలకమైన జాతర ఎపిసోడ్ యొక్క గ్లింప్స్ ఇటీవల రిలీజ్ చేయగా బాగా రెస్పాన్స్ లభించింది. తాజాగా ఆ భారీ ఎపిసోడ్ గురించి సినీ వర్గాల్లో ఒక న్యూస్ వైరల్ అవుతోంది.
దాని ప్రకారం మూవీలో జాతర ఎపిసోడ్ కి థియేటర్స్ మొత్తం షేక్ అవ్వడం ఖాయం అని, ముఖ్యంగా అర్ధనారీశ్వర అవతారంలో అల్లు అర్జున్ పవర్ఫుల్ పెరఫార్మన్స్ అందరినీ ఆకట్టుకోవడం ఖాయం అంటున్నారట మూవీ టీమ్. ఇక ఈ మూవీ కోసం మొత్తంగా మూడేళ్ళ సమయం తీసుకున్నారు టీమ్ సభ్యులు, మొత్తంగా తమ మూవీ రిలీజ్ అనంతరం డిసెంబర్ 5న గ్రాండ్ సక్సెస్ అందుకోవడం ఖాయం అని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.