Homeసినిమా వార్తలుThank you Movie: సినిమా పబ్లిసిటీ పై నిరాశలో ఉన్న అక్కినేని అభిమానులు

Thank you Movie: సినిమా పబ్లిసిటీ పై నిరాశలో ఉన్న అక్కినేని అభిమానులు

- Advertisement -

అక్కినేని వార‌సుడు నాగ చైతన్య త‌నదైన నట‌న‌, అభిన‌యంతో ప్రేక్ష‌కుల‌లో ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవలే ‘ల‌వ్‌స్టోరీ’, ‘బంగార్రాజు’ వంటి వ‌రుస హిట్ల‌తో జోరుమీదున్న చైత‌న్య తన తదుపరి చిత్రం థాంక్యూ తో హ్య‌ట్రిక్ కొడతారని అక్కినేని అభిమానులు నమ్మకంతో ఉన్నారు.

మనం ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ‘థాంక్యూ’ చిత్రం విడుద‌లకు సిద్ధంగా ఉంది.నిజానికి ఈ చిత్రం జూలై 8న విడుద‌ల కావల్సి ఉన్నా.. ప‌లు కార‌ణాల వ‌ల్ల ఈ చిత్రం రెండు వారాలు పోస్ట్ పోన్ అయి జూలై 22న విడుదల అవుతుంది. మొదట్లో ఈ చిత్ర‌బృందం వ‌రుస అప్‌డేట్‌ల‌ను ప్ర‌క‌టిస్తూ సినిమాపై ఆస‌క్తిని పెంచడానికి తమ వంతు కృషి చేశాయి. అయితే ఈ చిత్రం విడుదల వాయిదా వేసిన క్షణం నుంచి ప్రచార కార్యక్రమాలు అనేవి లేకుండా పోయాయి.

ఇప్పటికే విడుదలైన పాటలకు పరవాలేదు అనే స్ధాయిలో స్పందన వచ్చింది. ఇక టీజర్, ట్రైలర్ కూడా ఓకే అనిపించుకున్నాయి. అయితే సినిమా ఖచ్చితంగా చూడాలి అనిపించే విధంగా బజ్ క్రియేట్ చేయడంలో చిత్ర బృందం విఫలం అయిందనే చెప్పాలి. కెరీర్ మంచి దశలో ఉన్నప్పుడు ఇలా సినిమాకు సరైన ప్రచారం లేకపోవడం ఏమిటని అక్కినేని అభిమానులు తీవ్రంగా నిరాశ చెందినట్లు సమాచారం.

READ  ఇన్స్టాగ్రామ్ లో కోట్లు సంపాదిస్తున్న సమంతా

తాజాగా చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు.థాంక్యూ ప్రీ రిలీజ్ వేడుక‌ను జూలై 16న వైజాగ్‌లోని స‌ర్ సీఆర్ రెడ్డి క‌న్వెన్ష‌న్ హాల్‌లో జ‌రుప‌నున్న‌ట్లు మేక‌ర్స్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ చిత్రంతో నాగ‌చైత‌న్య‌కు జోడీగా రాశీఖ‌న్నా, మాళ‌విక నాయ‌ర్‌, అవికా గోర్ హీరోయిన్‌లుగా న‌టించారు. త‌మ‌న్ సంగీతం అందించిన ఈ చిత్రానికి ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ పీ.సీ శ్రీరామ్ ఛాయ‌గ్ర‌హ‌కుడిగా ప‌నిచేశాడు. శ్రీవెంక‌టేశ్వ‌రా క్రియేష‌న్స్ ప‌తాకంపై దిల్‌రాజు, శిరీష్‌లు నిర్మించారు.

Follow on Google News Follow on Whatsapp

READ  Box-Office అంటే సుందరానికీ నాలుగవ రోజు కలెక్షన్ లు పెద్ద షాక్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories