యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ లవ్ యాక్షన్ ఎమోషనల్ పేట్రియాటిక్ మూవీ తండేల్. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చగా సాయి పల్లవి హీరోయిన్ గా నటించారు.
ఇటీవల మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చిన తండేల్ మూవీ పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుని ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్ తో కొనసాగుతోంది. ఈ మూవీలో రాజు, సత్య పాత్రల్లో నటించిన చైతన్య, సాయి పల్లవి ఇద్దరు కూడా తమ తమ అద్భుత పర్ఫామెన్స్ తో ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకున్నారు.
అలానే దర్శకుడు చందు మండేటి తెరకెక్కించిన విధానం కూడా అందర్నీ ఎంతో అలరిస్తోంది. ఇక తండేల్ మూవీ మనదేశంలో బాగానే ఆడుతున్నప్పటికీ అమెరికాలో మాత్రం ఆశించిన స్థాయిలో పెర్ఫామ్ చేయలేకపోతోంది. నిజానికి ఈ మూవీకి వచ్చిన టాక్ కి ఈపాటికి 1.5 మిలియన్లు అర్జించాల్సి ఉండగా ఇంకా 700కె మాత్రమే నిలిచి ఉంది ఈ సినిమా.
మరి అతి త్వరలో ఈ మూవీ 1 మిలియన్ మార్కు అందుకుంటుందో లేదో తెలియాలి అంటే ఈ వీకెండ్ వరకు వేచి చూడాలి. ఇక ఓవర్సీస్ మొత్తం కలుపుకొని నాలుగు రోజుల్లో తండేల్ మూవీ 950కె మాత్రమే కలెక్షన్ సొంతం చేసుకుంది.