టాలీవుడ్ యువ నటుడు అక్కినేని నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా యువ దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతోన్న లవ్ యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ మూవీ తండేల్. అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ ఫిబ్రవరి మరొక నాలుగు రోజుల్లో అనగా ఫిబ్రవరి 7న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది.
ఇప్పటికే తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో కూడా తండేల్ ప్రమోషన్స్ బాగానే నిర్వహించింది టీమ్. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ అందించిన సాంగ్స్ కూడా ఆకట్టుకోవడంతో బాక్సాఫిస్ వద్ద తమ మూవీ విజయం ఖాయం అని అంటోంది టీమ్. అయితే విషయం ఏమిటంటే, ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్స్ ని తాజాగా నిర్ణయించారు.
అయితే తెలంగాణలో తండేల్ కి సాధారణ రేట్స్ మాత్రమే ఉండనున్నాయి. ఆ ప్రకారం మల్టి ప్లెక్స్ లో రూ. 295, సింగిల్ స్క్రీన్స్ లో రూ. 175 లు గా ఉండనుంది. అలానే అటు ఆంధ్ర లో మాత్రం మల్టి ప్లెక్స్ లో రూ. 177 అలానే సింగిల్ స్క్రీన్స్ లో రూ. 144 గా ఉంది. కాగా దీనికి సంబంధించి రేట్స్ ని రూ. 50 పెంపు కోసం ఆంధ్ర ప్రభుత్వాన్ని కోరింది తండేల్ టీమ్. కాగా దాని పై అప్రూవల్ రావాల్సి ఉంది.