Home సినిమా వార్తలు Thandel Team Hurts Journalists జర్నలిస్టులని హర్ట్ చేసిన ‘తండేల్’ టీమ్

Thandel Team Hurts Journalists జర్నలిస్టులని హర్ట్ చేసిన ‘తండేల్’ టీమ్

thandel

యువ నటుడు అక్కినేని నాగచైతన్య హీరోగా అందాల భామ సాయి పల్లవి హీరోయిన్ గా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ తండేల్. ఈ మూవీని గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తుండగా యువ నిర్మాత బన్నీ వాసు గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం చివరి దశ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నట్లు నిన్నటి ప్రెస్ మీట్ లో భాగంగా టీమ్ తెలిపారు. ముఖ్యంగా ఈ మూవీ హీరో నాగచైతన్య ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకు చెప్పుకునేలా ఉంటుందని, అలానే మూవీ కోసం చైతు ఎంతో బాగా కష్టపడ్డారని నిర్మాత నాగ వంశి తెలిపారు. విషయం ఏమిటంటే, ఈ ప్రెస్ మీట్ లో భాగంగా కేవలం ఐదు ప్రశ్నలు మాత్రమే మీడియా వారు తమని అడగాలని పరిధి విధించింది తండేల్ టీమ్.

దానితో పలువురు జర్నలిస్టులు దీనిపై అసహనం వ్యక్తం చేసారు. ఒక మూవీ ప్రెస్ మీట్ నిర్వహించినపుడు ఈ విధంగా పరిధులు విధించడం సరికాదని వారు అన్నారు. అయితే ఇటీవల పలు మూవీ ప్రెస్ మీట్స్ లో జర్నలిస్టులు అడిగిన వివాదాస్పద ప్రశ్నలు చిలవలు పలవలవడంతోనే తండేల్ టీమ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version