Homeసినిమా వార్తలుThandel Team Hurts Journalists జర్నలిస్టులని హర్ట్ చేసిన 'తండేల్' టీమ్

Thandel Team Hurts Journalists జర్నలిస్టులని హర్ట్ చేసిన ‘తండేల్’ టీమ్

- Advertisement -

యువ నటుడు అక్కినేని నాగచైతన్య హీరోగా అందాల భామ సాయి పల్లవి హీరోయిన్ గా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ తండేల్. ఈ మూవీని గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తుండగా యువ నిర్మాత బన్నీ వాసు గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం చివరి దశ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నట్లు నిన్నటి ప్రెస్ మీట్ లో భాగంగా టీమ్ తెలిపారు. ముఖ్యంగా ఈ మూవీ హీరో నాగచైతన్య ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకు చెప్పుకునేలా ఉంటుందని, అలానే మూవీ కోసం చైతు ఎంతో బాగా కష్టపడ్డారని నిర్మాత నాగ వంశి తెలిపారు. విషయం ఏమిటంటే, ఈ ప్రెస్ మీట్ లో భాగంగా కేవలం ఐదు ప్రశ్నలు మాత్రమే మీడియా వారు తమని అడగాలని పరిధి విధించింది తండేల్ టీమ్.

దానితో పలువురు జర్నలిస్టులు దీనిపై అసహనం వ్యక్తం చేసారు. ఒక మూవీ ప్రెస్ మీట్ నిర్వహించినపుడు ఈ విధంగా పరిధులు విధించడం సరికాదని వారు అన్నారు. అయితే ఇటీవల పలు మూవీ ప్రెస్ మీట్స్ లో జర్నలిస్టులు అడిగిన వివాదాస్పద ప్రశ్నలు చిలవలు పలవలవడంతోనే తండేల్ టీమ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

READ  Devara Pre Release Event Cancel బ్రేకింగ్ : 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories