అక్కినేని నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో ప్రముఖ యువనిర్మాత బన్నీ వాసు గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్న తాజా సినిమా తండేల్. ఈ సినిమాకి యువ దర్శకుడు చందు మొండేటి దర్శకత్వం వహిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ దీనికి సంగీతం అందిస్తున్నారు.
ప్రారంభం నుంచి అందరిలో మంచి ఆసక్తి ఏర్పరచింది తండేల్ మూవీలో నాగచైతన్య ఒక పవర్ఫుల్ పాత్ర చేస్తుండగా దీనిని వాస్తవ ఘటనల ఆధారంగా తరికెక్కిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ లుక్ గ్లింప్స్ టీజర్ అందర్నీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచింది. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుక రిలీజ్ అవుతుందని అంటూ ఇటీవల కొన్నాళ్లుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి.
ఇక నేడు కొద్దిసేపటి క్రితం తండేల్ టీమ్ ప్రత్యేకంగా ప్రెస్ మీట్ నిర్వహించి మూవీ మూవీ యొక్క రిలీజ్ డేట్ అనౌన్స్ చేసారు చేశారు. కాగా తమ మూవీని ఫిబ్రవరి 7న అన్ని కార్యక్రమాలు ముగించి గ్రాండ్ లెవెల్ లో ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నట్టు మేకర్స్ తెలిపారు. తప్పకుండా నాగచైతన్య గారి అభిమానులందరికీ కూడా ఈ సినిమా మంచి ఐఫీస్టు అందిస్తుందని అలానే చైతు కెరీర్లో ఇది పెద్ద సక్సెస్సుఫుల్ మూవీ అవుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.