యువ నటుడు అక్కినేని నాగచైతన్య హీరోగా అందాల కథానాయిక సాయి పల్లవి హీరోయిన్ గా ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తండేల్. జాలరులకు సంబందించిన కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా గీతా ఆర్ట్స్ సంస్థ పై గ్రాండ్ లెవెల్లో నిర్మితం అవుతోన్న ఈ మూవీ ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది.
నాగచైతన్య ఒక పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్న ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ ఫిబ్రవరి 7న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది. ఇటీవల ఈ మూవీ రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ కి అందరి నుండి మంచి రెస్పాన్స్ లభించింది.
విషయం ఏమిటంటే, ఈ మూవీ నుండి బుజ్జి తల్లి అనే పల్లవితో సాగె ఫస్ట్ సాంగ్ ని నవంబర్ 21న రిలీజ్ చేయనున్నట్లు తాజాగా మేకర్స్ డేట్ అనౌన్స్ చేసారు. తప్పకుండా ఈ మూవీ రిలీజ్ అనంతరం అందరినీ ఆకట్టుకుని హీరోగా అక్కినేని నాగచైతన్య క్రేజ్ ని మార్కెట్ ని మరింతగా పెంచడం ఖాయం అని ఇటీవల తండేల్ ప్రెస్ మీట్ లో భాగంగా నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ చెప్పారు.