ఇటీవల తండేల్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చిన అక్కినేని నాగ చైతన్య ఆ మూవీతో పెద్ద విజయం సొంతం చేసుకున్నారు. కెరీర్ పరంగా ఈ మూవీ చైతన్య కు మంచి బ్రేక్ ని అందించింది. ఈ మూవీలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించగా కీలక పాత్రల్లో ఆడుకాలం నరేన్, కల్పలత, బబ్లు పృథ్వీరాజ్, రంగస్థలం మహేష్, కరుణాకరన్ తదితరులు నటించారు.
రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చిన తండేల్ మూవీ ఫస్ట్ డే నుండి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. చైతన్య, సాయి పల్లవిల యాక్టింగ్ తో పాటు దేవిశ్రీప్రసాద్ అందించిన సాంగ్స్, లవ్, ఎమోషనల్ సీన్స్ అందరినీ ఆకట్టుకున్నాయి.
ముఖ్యంగా దర్శకుడు చందూ మొండేటి ఈ మూవీని తెరకెక్కించిన తీరు పై మంచి పేరు లభించింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు గ్రాండ్ గా నిర్మించిన ఈ మూవీ ఓవరాల్ గా రూ. 85 కోట్ల మేర గ్రాస్ ని అలానే రూ. 46 కోట్ల మేర షేర్ ని అందుకుంది.
విషయం ఏమిటంటే లేటెస్ట్ టాలీవుడ్ అప్ డేట్ ప్రకారం ఈ మూవీ మార్చి 7 న ప్రముఖ ఓటిటి మాధ్యమం నెట్ ఫ్లిక్స్ ద్వారా పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది. దీనికి సంబంధించి వారి నుండి అధికారిక ప్రకటన కూడా రానుందని అంటున్నారు. మరి అటు థియేటర్స్ లో ఆకట్టుకున్న తండేల్, ఇటు ఓటిటిలో ఎంతమేర మెప్పిస్తుందో చూడాలి.