యువ సామ్రాట్ నాగచైతన్య అక్కినేని హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా యువ దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ లవ్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ తండేల్. ఈ మూవీ మొదటి నుండి మంచి అంచనాలు ఏర్పరిచి ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చింది.
దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చిన ఈ మూవీని గీత ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించారు. ఫస్ట్ డే ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న తండేల్ మూవీ ప్రస్తుతం చాలా ఏరియాల్లో మంచి కలెక్షన్ తో కొనసాగుతోంది. మొత్తంగా గడచిన ఐదు రోజుల్లో ఈ మూవీ రూ. 65 కోట్ల గ్రాస్ ని అలానే రూ. 37 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది.
టోటల్ గా ఈ మూవీ యొక్క బ్రేకీవెన్ రూ.40 కోట్లు కాగా, మరొక రెండు రోజుల్లో ఈ మూవీ ఆ ఫీట్ ని అందుకునే అవకాశం గట్టిగా కనపడుతోంది. దీనిని బట్టి మొదటి వారంలోనే తండేల్ బ్రేకీవెన్ అందుకోనున్నదన్నమాట. కాగా ఈ మూవీ చైతన్య కు రూ. 100 కోట్ల గ్రాస్ మూవీ అవుతుందని అక్కినేని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
సెకండ్ వీక్ కూడా బాగానే రన్ ఉంటె తప్పకుండా ఆ ఫీట్ కూడా చేరుకునే అవకాశం లేకపోలేదు. ఇక ఈ మూవీలో రాజు గా చైతన్య, సత్య గా సాయి పల్లవి ల సూపర్ పెర్ఫార్మన్స్ కి అందరి నుండి మంచి ప్రసంశలు లభిస్తున్నాయి.