టాలీవుడ్ యువ నటుడు నాగచైతన్య హీరోగా అందాల కథానాయిక సాయి పల్లవి హీరోయిన్ గా గీతా ఆర్ట్స్ బ్యానర్ పై యువ నిర్మాత బన్నీ వాసు గ్రాండ్ లెవెల్ లో నిర్మించిన తాజా యాక్షన్ ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ మూవీ తండేల్.
ఈ మూవీకి చందు మండేటి దర్శకత్వం వహించగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చారు. మొదటి నుంచి అందరిలో మంచి అంచనాలు ఏర్పరచిన తండేల్ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సంపాదించుకుంది.
ఇక ఈ మూవీ ప్రస్తుతం మంచి కలెక్షన్ తో బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. ముఖ్యంగా నిన్నటి సోమవారం టెస్ట్ లో పాసైన తండేల్ బాక్సాఫీస్ వద్ద బాగానే పెర్ఫార్మ్ చేసింది. ఇక ఈ మూవీ ఓవరాల్ గా నాలుగు రోజుల్లో రూ. 61 కోట్లకు గ్రాస్ ని అలానే రూ. 34 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది.
అక్కడక్కడ పలు ఏరియాల్లో బ్రేకీవెన్ సాధించిన ఈ మూవీ ఓవరాల్ గా చాలా ఏరియాల్లో బ్రేకీవెన్ తో పాటు కొద్దిపాటి లాభాలు ఆర్జించే అవకాశం కనపడుతోంది. మరి తండేల్ ఓవరాల్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.