తాజాగా యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా యువ దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించిన సినిమా తండేల్. మొదటి నుంచి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ ఇటీవల ఆడియన్స్ ముందుకు వచ్చి పెద్ద విజయం అందుకుంది.
నాగచైతన్య, సాయి పల్లవిల అద్భుతమైన పర్ఫామెన్స్ తో పాటు ఆకట్టుకునే కథ కథనాలతో దర్శకుడు చందు మండేటి ఈ మూవీని చక్కగా తెరకెక్కించారు. ఓవరాల్ గా అందర్నీ ఆకట్టుకున్న తండేల్ మూవీ ప్రస్తుతం రూ. 85 కోట్లు దాటి రూ. 100 కోట్ల వరకు గ్రాస్ అందుకునే దిశగా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ సక్సెస్ కెరీర్ పరంగా నాగచైతన్య కి మంచి బూస్ట్ అందించిందని చెప్పాలి.
త్వరలో మరికొన్ని సినిమాలు చేసేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. ఇక విషయం ఏమిటంటే తాజాగా లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం మార్చి 6న ప్రముఖ ఓటిటి మాధ్యమం నెట్ ఫ్లిక్స్ ద్వారా పలు భాషలు ఆడియన్స్ ముందుకు తండేల్ రిలీజ్ కానుందని తెలుస్తోంది.
ముఖ్యంగా థియేటర్స్ లో ఆడియన్స్ అలరించిన ఈ సినిమా అటు ఓటిటిలో కూడా అందర్నీ ఆకట్టుకుని మంచి వ్యూస్ ని సంపాదిస్తుందని టీం ఆశాభావం వ్యక్తం చేస్తుంది. త్వరలో తండేల్ మూవీ ఓటిటి రిలీజ్ కి సంబంధించిన అధికారిక డీటెయిల్స్ వెల్లడి కానున్నాయి. అయితే ఇటీవల తండేల్ అటు తమిళ, ఇటు హిందీ వర్షన్స్ లో మాత్రం పెద్దగా ఆడియన్స్ ని ఆకట్టుకోలేదు.