యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ లవ్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ తండేల్. మొదటి నుంచి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ ఇటీవల ఆడియన్స్ ముందుకు వచ్చి పెద్ద విజయం అందుకుంది.
రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించారు. ఆకట్టుకునే కథ కథనాలతో రూపొందిన తండేల్ మూవీలో నాగచైతన్య, సాయి పల్లవి అద్భుతమైన యాక్టింగ్ తో పాటు సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్, లవ్, ఎమోషనల్ సీన్స్ అందరి నుండి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి.
కాగా ఓవరాల్ గా థియేటర్లో రూ. 90 కోట్ల వరకు కలెక్షన్ రాబట్టిన ఈ మూవీ మార్చి 7న ఓటిటి ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ విషయాన్ని తాజాగా ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ అధికారికంగా అనౌన్స్ చేసింది.
ఈ మూవీ తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఓటిటి ఆడియన్స్ ముందుకు రానుంది. మరి థియేటర్స్ లో అదరగొట్టిన ఈ మూవీ ఎంత మేర ఓటీటీలో మెప్పిస్తుందో చూడాలి