టాలీవుడ్ స్టార్ యాక్టర్ గ్లోబల్ ఐకాన్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ప్రతిష్ట్మాకంగా నిర్మిస్తుండగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.
ఇప్పటికే రిలీజ్ అయిన రెండు సాంగ్స్ తో అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన గేమ్ ఛేంజర్ మూవీని వాస్తవానికి డిసెంబర్ 20న విడుదల చేయాలని భావించారు. అయితే మూవీని 2025 రిలీజ్ చేయడం కరెక్ట్ అని భావించిన మేకర్స్ ఫైనల్ గా తమ మూవీని 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న భారీ స్థాయిలో రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసారు. దానితో డిసెంబర్ 20కి పలు సినిమాలు రిలీజ్ ని ప్లాన్ చేస్తున్నాయి.
కాగా వాటిలో ముఖ్యంగా నాగచైతన్య, సాయి పల్లవిల కలయికలో యువ దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ పై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. విషయం ఏమిటంటే, లేటెస్ట్ టాలీవుడ్ ట్రాయ్ బజ్ ప్రకారం ఈ మూవీని డిసెంబర్ 20న ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారట. అయితే దీని పై ఆ మూవీ మేకర్స్ నుండి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రావాల్సి ఉంది.