యువ నటుడు అక్కినేని నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా యువ దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ లవ్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ తండేల్. మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పచిన ఈ మూవీ ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
ఈ మూవీని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఇక ఇప్పటివరకు ఈ మూవీ రూ. 73 కోట్ల గ్రాస్ ని అలానే రూ. 40 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తన కెరీర్ లో ఈ మూవీ ద్వారా ఫస్ట్ డే హైయెస్ట్ తో పాటు బిగ్గెస్ట్ కలెక్షన్ అందుకున్నారు అక్కినేని నాగ చైతన్య. అలానే దాదాపుగా అన్ని ఏరియాల్లో ఈ మూవీ బ్రేకీవెన్ చేరుకుంది.
అయితే తండేల్ మూవీ ఓవర్సీస్ లో మాతరం ఆశించిన స్థాయిలో రాబట్టడం లేదు. ఇప్పటికీ అక్కడ చాలా లో గా పెర్ఫార్మ్ చేసిన తండేల్, రెండవ వారంలో రాబట్టే దానిని బట్టి అక్కడ యావరేజ్ వెంచర్ గా నిలిచే అవకాశం కనపడుతోందని అంటున్నారు ట్రేడ్ పండితులు. మరోవైపు తమిళ్, హిందీలో బాగానే ప్రమోషన్స్ చేసినప్పటికీ తండేల్ ఆయా భాషల్లో కలెక్షన్ పరంగా పూర్తిగా నిరాశనే మిగిల్చింది.