Homeసినిమా వార్తలుThandel Day 1 Boxoffice Collections '​తండేల్' డే 1 బాక్సాఫీస్ కలెక్షన్స్ 

Thandel Day 1 Boxoffice Collections ‘​తండేల్’ డే 1 బాక్సాఫీస్ కలెక్షన్స్ 

- Advertisement -

యువ నటుడు అక్కినేని నాగ చైతన్య హీరోగా యువ దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ లవ్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ తండేల్. ఈ మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ అన్ని కూడా అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. 

సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ మూవీని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు గ్రాండ్ గా నిర్మించగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చారు. కాగా నిన్న రిలీజ్ అయిన తండేల్ అందరి నుండి మంచి పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. కెరీర్ పరంగా ఈ మూవీతో నాగ చైతన్య మంచి బ్రేక్ అందుకునే అవకాశం కనపడుతోంది. 

అక్కడక్కడా కొంత స్లో పేస్ లో సాగినప్పటీకీ ఓవరాల్ గా యాక్షన్ ఎమోషనల్ లవ్ సీన్స్ తో పాటు సాంగ్స్, హీరో హీరోయిన్స్ యాక్టింగ్ విజువల్స్ దీనికి ప్రధాన బలాలు. కాగా ఈ మూవీ ఫస్ట్ డే నైజాంలో రూ. 5.6 కోట్ల గ్రాస్, హైర్స్ తో కలుపుకుని సీడెడ్ లో రూ. 1.9 కోట్లు, ఆంధ్ర లో మొత్తం రూ. 6.5 కోట్లు రాబట్టింది. అలానే రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 14 కోట్ల గ్రాస్ దక్కించుకుంది. 

READ  ​Sankranthiki Vasthunam Final Grand Success Meet Fix 'సంక్రాంతికి వస్తున్నాం' ఫైనల్ గ్రాండ్ సక్సెస్ మీట్ ఫిక్స్

అటు ఓవర్సీస్ లో ఓపెనింగ్ డే 500కె డాలర్స్ అందుకుంది. మొత్తంగా తండేల్ డే 1 వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ గ్రాస్ రూ. 20 కోట్లు కాగా షేర్ రూ.​ 11.5 కోట్లు. ప్రపంచవ్యాప్తంగా ​బ్రేకీవెన్ షేర్ ​రూ. 40 కోట్లు​ కాగా తండేల్ మూవీ​డే 1 దాదాపు 30% రికవరీ సాధించింది, ఇది ​రాబోయే రోజుల్లో ​చైతన్య కెరీర్ లో బెస్ట్ గా నిలిచే అవకాశం కనపడుతోంది. 

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories