టాలీవుడ్ యువనటుడు అక్కినేని నాగచైతన్య హీరోగా అందాల కథానాయిక సాయి పల్లవి హీరోయిన్ గా తాజాగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ తండేల్. ఈ మూవీలో బబ్లు పృధ్వీరాజ్, కరుణాకరన్, కల్పలత, రంగస్థలం మహేష్ తదితరులు కీలకపాత్రలో కనిపించగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ దీనికి సంగీతం సమకూర్చారు.
ప్రముఖ నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ పై గ్రాండ్ లెవెల్ లో యువ నిర్మాత బన్నీ వాసు దీనిని నిర్మించారు. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది తండేల్ మూవీ. తాజాగా ఈ సినిమా మొత్తంగా గడిచిన 10 రోజుల్లో రూ. 82 కోట్లకు పైగా గ్రాస్ ని మరియు రూ. 45 కోట్ల షేర్ ని సాధించింది.
ఇక ఈ సినిమా యొక్క థియేటర్ రైట్స్ రూ. 40 కోట్లకు అమ్ముడవగా ఈ మూవీ దానిని అధిగమించి మరింతగా లాభాలు రాబట్టింది. ప్రస్తుతం రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ మార్కుకు చేరువవుతోంది తండేల్ మూవీ. మరి రెండవ వారంలోకి సక్సెస్ఫుల్ గా అడుగుపెట్టిన ఈ మూవీ ఎంత మేర రాబడుతుందో ఓవరాల్ గా క్లోజింగ్ లో ఎంత కలెక్ట్ చేస్తుందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే