Home సినిమా వార్తలు థమన్ నోటి దూలకు తీవ్ర విమర్శలు 

థమన్ నోటి దూలకు తీవ్ర విమర్శలు 

thaman

టాలీవుడ్ రాకింగ్ మ్యూజికల్ సెన్సేషన్ ఎస్ థమన్ ప్రస్తుతం కెరీర్ పరంగా వరుసగా సినిమాలతో కొనసాగుతున్నారు. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ తీసిన అలవైకుంఠపురములో మూవీలోని చార్ట్ బస్టర్ సాంగ్స్ తో నేషనల్ వైడ్ ఆడియన్స్ ని ఆకట్టుకున్న థమన్ ఆ మూవీతో ఏకంగా ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు. మరోవైపు పలు సినిమాలతో ఆయన బిజీగా ఉన్నారు. 

అయితే తాజాగా థమన్ చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో విమర్శల పాలవుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ అయిన సినిమాల్లో రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్, బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమాలకు థమన్ మ్యూజిక్ అందించారు. వాటిలో గేమ్ ఛేంజర్ అతి పెద్ద డిజాస్టర్ అవగా డాకు మహారాజ్ ఆకట్టుకుంది. 

అయితే ఈ సినిమాల యొక్క ఆడియోస్ శ్రోతలను అంతగా ఆకట్టుకోలేదు, ముఖ్యంగా గేమ్ ఛేంజర్ సాంగ్స్ పై చాలా నెగటివిటీ వచ్చింది. కాగా లేటెస్ట్ ఇంటర్వ్యూ లో భాగంగా థమన్ మాట్లాడుతూ, గేమ్ చేంజర్ ఆడియో ఫెయిల్ అవ్వడానికి మొత్తం టీమ్ కారణం అన్న మాట. డాకు మహారాజ్ కూడా ఆడియో పరంగా సినిమాకు ప్లస్ కాలేదని విమర్శలు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఒక్క హుక్ స్టెప్ లేకుండానే ఆడియో అంత పెద్ద హిట్ అయిందని సెటైర్లు. 

 కాగా ఈ కామెంట్స్ పై పలువురు విమర్శలు చేస్తున్నారు. అలా అయితే పలువురు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వంటి వాటిలో డీజే సాంగ్స్ తో మంచి స్టెప్స్ తో ఆకట్టుకుంటున్నారు, మరి అవి అన్ని కూడా ఎందుకు చార్ట్ బస్టర్స్ అవడం లేదు. ఆ మాత్రం దానికి ఎన్నో కోట్లు మీకు ఇచ్చి ప్రత్యేకంగా మ్యూజిక్ ఎందుకు చేయించుకోవడం, చిన్న మ్యూజిక్ డైరెక్టర్ తో సాంగ్స్ కంపోజ్ చేయించి హుక్ స్టెప్స్ పెట్టుకుంటే అవే పాపులర్ అవుతాయి కదా అంటూ తీవ్రంగా కామెంట్స్ చేస్తున్నారు.    

వాస్తవానికి గేమ్ చేంజర్ రిలీజ్ ముందు థమన్ ఈ పాట వీడియో కుమ్మేస్తాది, ఆ పాట చాలా బాగుంటుంది, ది బెస్ట్ అని పొగిడాడు. ఇప్పుడు మళ్ళీ రిలీజ్ తరువాత టీమ్ మీద తప్పు వేయడం చాలా తప్పుడు చర్య. ‘రా మచ్చ’, ‘ధోప్’, ‘జరగండి’ లాంటి పాటలు చాలా బిలో అవరేజ్ అనిపించాయి. గేమ్ చేంజర్ బడ్జెట్‌కు అసలు సరిపోని పాటలు. ఇలాంటి అనవసరమైన కామెంట్స్ చేస్తే ఉపయోగం ఏముంది అనేది ఆయనే చెప్పాలి. 

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version