ఇటీవల ఆడియన్స్ ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్న యూత్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ మ్యాడ్. ఇక ఈ మూవీకి సీక్వెల్ గా ప్రస్తుతం సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంస్థలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న సినిమా మ్యాడ్ స్క్వేర్. ఈ సినిమాలో నార్ని నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, విష్ణు తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తుండగా కళ్యాణ్ శంకర్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.
ఇప్పటికే మ్యాడ్ స్కోర్ నుంచి రిలీజ్ అయిన ప్రచార చిత్రాలన్నీ కూడా అందరిని విశేషంగా ఆకట్టుకొని సినిమాపై మంచి అంచనాలు ఏర్పరిచాయి. ముఖ్యంగా పార్ట్ 1 ని మించేలా ఇందులో మరింత యాక్షన్ యూత్ఫుల్ అంశాలు ఉన్నాయని అలానే ఎంటర్టైన్మెంట్ కూడా మరింత అద్భుతంగా ఉంటుందని చెప్తున్నారు.
ఇక ఈ సినిమాలో గౌరీ ప్రియ, అవంతిక స్థానంలో మరొక ముగ్గురు నూతన కథానాయికలు కనిపించినట్టు తెలుస్తోంది. తప్పకుండా తమ సినిమా అందరినీ ఆకట్టుకుంటుందని భీమ్స్ సిసిలోరియో అందించిన మ్యూజిక్ కి మంచి రెస్పాన్స్ రావటం ఆనందంగా ఉందని చెప్తుంది టీం. అయితే విషయం ఏమిటంటే ఈ సినిమాకి రాక్ స్టార్ ఎస్ థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించనున్నారు.
ఈ విషయాన్ని కొద్దిసేపటి క్రితం మ్యాడ్ స్క్వేర్ టీం అఫీషియల్ గా అనౌన్స్ చేయగా ప్రత్యేకంగా ఈ సినిమా కోసం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించినట్లు తమన్ కూడా తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ద్వారా తెలిపారు. మరి మ్యాడ్ స్క్వేర్ సినిమా మార్చి 28న రిలీజ్ అనంతరం ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.