తమిళ సూపర్ స్టార్, అభిమానుల చేత ప్రేమగా దళపతి అని పిలిపించుకునే విజయ్ కథానాయకుడిగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో 7 స్క్రీన్ స్టూడియో ప్రతిష్టాత్మక నిర్మిస్తున్న ప్రాజెక్ట్ ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. మాస్టర్, వారసుడు వంటి బ్లాక్‌బస్టర్ విజయాల తర్వాత మూడవసారి విజయ్ తో కలిసి ఈ ప్రొడక్షన్ హౌస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘దళపతి 67’ అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు.
”మాస్టర్’తో అద్భుతమైన విజయాన్ని అందుకున్న దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కలయికలో వస్తున్న రెండవ సినిమా ఇది. ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు, జగదీష్ పళనిసామి సహ నిర్మాత. జనవరి 2, 2023న ప్రారంభమైన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ చేరారు. ఈ చిత్రంలో భాగం అయినందుకు ఆనందం వ్యక్తం చేశారు. ”దలపతి67 వన్ లైనర్ విన్నప్పుడే ఈ చిత్రంలో భాగం అవుతానని తెలుసు. ఈ ప్రయాణాన్ని ప్రారంభించినందుకు చాలా థ్రిల్లింగ్ గా వుంది” అన్నారు సంజయ్ దత్.
ఈ చిత్రంలో నటించే నటీనటుల గురించి దర్శకుడు లోకేష్ సినిమాను అంగీకరించినప్పటి నుండి అనేక అస్పష్టమైన వివరాలు క్రమం తప్పకుండా చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన సహాయక తారాగణాన్ని అధికారికంగా ప్రకటించడం ద్వారా నిర్మాతలు ఈ ఊహాగానాలకు తెరదించారు.
సీనియర్ నటుడు అర్జున్ సర్జాతో పాటు సమర్థులైన దర్శకులు గౌతమ్ మీనన్, మిస్కిన్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు అయితే ఈ సినిమాలో హీరోయిన్ (త్రిష కృష్ణన్ నటించబోతుందని ప్రచారం) పాత్ర పోస్టర్ ను మాత్రం నిర్మాతలు ఇంకా రివీల్ చేయలేదు.
గౌతమ్ మీనన్, మిస్కిన్, అర్జున్ సర్జా, ప్రియా ఆనంద్, మన్సూర్ అలీ ఖాన్, మలయాళ నటుడు మాథ్యూ థామస్, కొరియోగ్రాఫర్ శాండీతో పాటు మరి కొంత మంది భారీ తారాగణం ఈ సినిమాలో భాగం కానుంది.
కత్తి, మాస్టర్, బీస్ట్ చిత్రాలకు చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌లను అందించిన రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్.. ఈ చిత్రం కోసం నాలుగో సారి విజయ్ తో కలసి పని చేస్తున్నారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫర్‌గా, ఫిలోమిన్ రాజ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఎన్. సతీస్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్న ఈ చిత్రానికి రామ్ కుమార్ బాలసుబ్రమణియన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.