Home సినిమా వార్తలు Thalapathy 69 was Remake of that Movie ఇలయదళపతి విజయ్ 69 ఆ మూవీకి...

Thalapathy 69 was Remake of that Movie ఇలయదళపతి విజయ్ 69 ఆ మూవీకి రీమేకే

thalapathy 69

కోలీవుడ్ స్టార్ నటుడు ఇలయదళపతి విజయ్ తాజాగా రాజాకీయ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల ఆయన హీరోగా వెంకట్ ప్రభు తీసిన ది గోట్ మూవీ బాక్సాఫీస్ వద్ద బాగానే విజయం అందుకుంది. అయితే దీని అనంతరం తన కెరీర్ 69వ మూవీని ఇటీవలగ్రాండ్ గా అనౌన్స్ చేసారు విజయ్. యువ దర్శకుడు హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తుండగా అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.

పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనున్న ఈ మూవీలో బాబీ డియోల్, ప్రకాష్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రియమణి, మమిత బైజు తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈమూవీ పై విజయ్ ఫ్యాన్స్ తో పాటు మాములు ఆడియన్స్ లో కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి.

విజయ్ కెరీర్ మూవీ కావడంతో దీనిని ఎంతో జాగ్రత్తగా దర్శకుడు విజయ్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మ్యాటర్ ఏమిటంటే, ఇటీవల బాలకృష్ణ హీరోగా శ్రీలీల ప్రధాన పాత్రలో తండ్రి కూతురు కథగా రూపొందిన భగవంత్ కేసరి మూవీకి ఇది రీమేక్ అని అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. కాగా లేటెస్ట్ కోలీవుడ్ న్యూస్ ప్రకారం ఇది పక్కాగా భగవంత్ కేసరి రీమేక్ అని స్పష్టమైంది.

ఈ మూవీ నిర్మాతల సన్నిహితుల నుండి అందుతున్న న్యూస్ బట్టి తాజాగా రిలీజ్ అయిన ఒక తెలుగు మూవీ రీమేక్ రైట్స్ ని వారు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే విజయ్ ఫ్యాన్స్ మాత్రం ఆయన ఆఖరి మూవీ స్ట్రెయిట్ ఫిలిం అయితే బాగుంటుదని భావిస్తున్నారు. మరి వచ్చే ఏడాది అక్టోబర్ 16న రిలీజ్ కానున్న ఈ మూవీ ఎంతమేర విజయం అందుకుంటుందో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version