Home సినిమా వార్తలు Thalapathy 67: కేవలం నాన్ థియేట్రికల్ బిజినెస్ తో టేబుల్ ప్రాఫిట్స్ లో ఉన్న దళపతి...

Thalapathy 67: కేవలం నాన్ థియేట్రికల్ బిజినెస్ తో టేబుల్ ప్రాఫిట్స్ లో ఉన్న దళపతి 67 నిర్మాతలు

విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘దళపతి 67’ మూవీ లవర్స్ తో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ‘మాస్టర్’ తర్వాత ఈ సక్సెస్ఫుల్ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్ స్టార్ కాస్ట్ ఉందని అనౌన్స్ చేసినప్పటి నుంచి మంచి క్రేజ్ ఏర్పడింది.

ఈ చిత్రంలో సంజయ్ దత్ నెగెటివ్ రోల్ లో నటిస్తుండగా, 14 ఏళ్ల తర్వాత విజయ్ సరసన త్రిష నటిస్తున్నారు. అర్జున్ సర్జా, మన్సూర్ అలీఖాన్, ప్రియా ఆనంద్, మిస్కిన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఇతర కీలక పాత్రలను పోషిస్తున్నారు.

విజయ్, లోకేష్ బ్రాండ్ ఈ సినిమా కోసం మ్యాజిక్ చేస్తోంది. నాన్ థియేట్రికల్ బిజినెస్ అంతా రికార్డు ధరలకు అమ్ముడవుతోంది. 250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే నాన్ థియేట్రికల్ రైట్స్ నుంచి రికవరీ అయింది. మ్యూజిక్ రైట్స్ 16 కోట్లకు అమ్ముడుపోగా, డిజిటల్ రైట్స్ 150 కోట్లకు అమ్ముడయ్యాయి. శాటిలైట్ రైట్స్ 80 కోట్లకు అమ్ముడుపోగా, హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా భారీ మొత్తాన్ని రాబట్టాయి.

ఆ రకంగా కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ తో దళపతి 67 నిర్మాతలు బ్రేక్ ఈవెన్ సాధించారు. కాగా ఈ సినిమాకి లోకేష్, విజయ్ ఇద్దరూ రెమ్యునరేషన్ తీసుకోవడంతో పాటు లాభాల్లో భాగస్వామ్యం కూడా తీసుకుంటున్నారని అంటున్నారు. లోకేష్ తో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆయన సరైన బడ్జెట్ లో, చాలా త్వరగా సినిమాలు తీస్తారు. విక్రమ్, మాస్టర్, మానగరం, ఖైదీ వంటి సినిమాలకు నిర్మాతకు భారీ లాభాలు వచ్చాయి.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version