Homeసినిమా వార్తలుచిన్న హీరోల రెమ్యునరేషన్ తగ్గించనున్న తెలుగు సినీ నిర్మాతలు

చిన్న హీరోల రెమ్యునరేషన్ తగ్గించనున్న తెలుగు సినీ నిర్మాతలు

- Advertisement -

తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుత స్థితిగతులను అనుసరించి నిర్మాతలు కొన్ని ముఖ్య నిర్ణయాలు మరియు వ్యవహార కార్యక్రమాల్లో మార్పులు చేస్తున్నారు. అందులో ముఖ్యమైన అంశం హీరోల పారితోషికాలు. వాటిలో మార్పు తెచ్చేందుకు నిర్మాతలు హీరోలు జీతంలో కోత విధించాలని నిర్ణయించారని తెలుస్తోంది.

అయితే ఇక్కడ స్టార్ హీరోలకు వచ్చిన ఇబ్బందేమీ లేదు. వారి రెమ్యూనరేషన్లు ఇప్పటికీ అలాగే ఉంటాయి, కాకపోతే చిన్న హీరోలకే ఇబ్బంది. వారి పారితోషికాలలోనే ఇప్పుడు నిర్మాతలు కోత విధించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

నిర్మాతల మండలి మరియు గిల్డ్ గత కొన్ని నెలలుగా OTT విడుదలలు, రెమ్యూనరేషన్లు, టిక్కెట్ రేట్లు మొదలైన వాటి గురించి వివిధ సమావేశాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దానికి తోడు చిన్న, మీడియం రేంజ్ హీరోలకు ఇచ్చే రెమ్యునరేషన్ గురించి కూడా చర్చించుకున్నారు.

ప్రస్తుత తెలుగు చిత్ర పరిశ్రమ ఒకరకమైన గందరగోళ పరిస్థితిలో ఉందనే మాట వాస్తవం. కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తుంటే, కొన్ని తొలిరోజునే దారుణంగా డిజాస్టర్లు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక పై చిన్న హీరోలకు భారీ అడ్వాన్స్‌లు మరియు రెమ్యునరేషన్‌లను ఇవ్వబోయేది లేదని నిర్మాతలు హీరోలకు తెలియజేస్తున్నారని సమాచారం.

ఒక ఉదాహరణ తీసుకుంటే, నాగ చైతన్య హీరోగా నటించిన థాంక్యూ సినిమా తొలి రోజునే బాక్సాఫీస్ వద్ద దారుణంగా పడిపోయింది. ఇదిలా ఉండగా, కళ్యాణ్ రామ్ బింబిసార సినిమా కేవలం 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. దానర్థం మంచి సినిమా తీస్తే, అది ఖచ్చితంగా ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది అనే కదా.

READ  సీతగా మారలేక పోయిన పూజా హెగ్డే

అందువల్ల సినిమాకు జరిగిన బిజినెస్‌ శాతాన్ని బట్టి చిన్న హీరోలకు రెమ్యూనరేషన్‌ ఇవ్వాలని నిర్మాతలు ఓ నిర్ణయానికి వచ్చారట. మరి నిర్మాతలు తీసుకున్న నిర్ణయం నిజమే అయితే.. ఇక నుంచీ చిన్న హీరోలకు చిన్న రెమ్యునరేషన్లు ఖరారు చేస్తారన్నమాట. అయితే ఈ నిర్ణయానికి కట్టుబడి ఉండటం అంత సులువేమీ కాదు. ఈ నిర్ణయాన్ని అమలు చేస్తారో లేదో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp

READ  తొమ్మిదేళ్ళ తరువాత సినిమాల్లోకి వస్తున్న వేణు


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories