Home సినిమా వార్తలు కొత్త నిర్ణయాలు, నిభందనలు ప్రకటించిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్

కొత్త నిర్ణయాలు, నిభందనలు ప్రకటించిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్

Tollywood Producers

గత కొన్ని నెలలుగా, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న సమస్యలు పరిష్కరించడం కోసం కొన్ని రోజులుగా కొత్త నిభందనలు మరియు మార్గదర్శకాలను తీసుకురావడానికి సన్నాహాలు కూడా చేస్తుంది. కొన్ని వారాల క్రితం పరిశ్రమలో సమస్యలు పరిష్కరించే వరకు సినిమాల షూటింగ్‌లను నిలిపివేయాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.తాజాగా ఛాంబర్ మళ్లీ సమావేశమై OTT, శాటిలైట్ డీల్స్‌తో పాటు కళాకారుల పారితోషికానికి సంబంధించి కొన్ని కీలక అంశాల పై చర్చించడం జరిగింది. డా.రామానాయుడు భవనంలోని తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలిలో ఈ సమావేశం జరిగింది. ఈ క్రమంలో అందరితోనూ ముఖ్యమైన అంశాలు చర్చించబడ్డాయి. ఈ మేరకు ఛాంబర్ విధించిన నియమాలు ఏవిటంటే..

సినిమాల నిర్మాణం

సినిమాల్లో నటించే ఏ ఆర్టిస్టు లేదా టెక్నీషియన్‌లకు ప్రతి రోజు పారోతోషికం చెల్లించడం ఉండదు. కళాకారులందరి వేతనాలలోనే సిబ్బంది, స్థానిక రవాణా, స్థానిక వసతి మరియు ప్రత్యేక ఆహారంకి సంభందించిన ఖర్చులు కూడా కలిసే ఉంటాయి. కాగా ఆ పారితోషికాన్ని నిర్మాత ముందే ఖరారు చేయాలి.. అలా ఖరారు చేసి పరస్పరం అంగీకరించిన అమౌంట్ నే రెమ్యునరేషన్‌గా ఇవ్వడం జరుగుతుంది తప్ప మళ్ళీ కళాకారుడికి ఎలాంటి ఇతర చెల్లింపు చేయడం జరగదు.

ఛాంబర్‌కి షూటింగ్ ప్రారంభమయ్యే ముందు అన్ని రుసుము వివరాలను నమోదు చేయాలి. ఛాంబర్ ఆ వివరాలను ధృవీకరించిన తర్వాత మాత్రమే షూటింగ్ నిర్వహించాలి. రోజువారీ కాల్ షీట్ సమయాలను కూడా ఖచ్చితంగా అమలు చేయాలి మరియు నిర్మాత ఇవన్నీ సక్రమంగా ఒక నివేదికలో పొందు పరచాలి.

OTT

OTTకి సంబంధించిన కొత్త నిబంధనలతో ఛాంబర్ చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. ధియేట్రికల్ రిలీజ్ నుంచి ఓటిటి రిలీజ్ కి మధ్య గ్యాప్ లో ఈసారి ఎటువంటి మార్పు ఉండదు. బాక్సాఫీస్ వద్ద సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఫలితంతో సంబంధం లేకుండా OTT విడుదలకు ఖచ్చితంగా 8 వారాల గడువు ఉంటుంది అని చాలా స్పష్టంగా చెప్పారు.

అలాగే ఏ సినిమా కూడా తమ డిజిటల్/శాటిలైట్ పార్టనర్‌ను సినిమా థియేటర్లలో విడుదలైనప్పుడు టైటిల్ కార్డ్‌లో చుపించకూడదని అలాగే థియేట్రికల్ పబ్లిసిటీ కోసం కూడా ఉపయోగించకూడదని ఛాంబర్ చాలా స్పష్టంగా చెప్పింది.

థియేట్రికల్/ఎగ్జిబిషన్

VPF ధరల పై చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ విషయం మీద త్వరలో నిర్ణయం తీసుకోబడుతుంది. సెప్టెంబరు 3న ఛాంబర్‌లో ఈ విషయం పైనే చర్చ జరగాల్సి ఉండగా.. దానిని సెప్టెంబర్‌ 6వ తేదీకి వాయిదా వేశారు. ఇక తెలంగాణలో ఇచ్చినట్లే ఆంధ్రా మల్టీప్లెక్స్‌లలో వీపీఎఫ్‌ శాతం ఇవ్వనున్నారు.ఫెడరేషన్దీనిపై ఛాంబర్‌లో ఇంకా చర్చలు జరుగుతున్నాయి, త్వరలోనే ఛాంబర్ తుది నిర్ణయం వెలువడనుంది. ఛాంబర్ ఆమోదించిన, అందరితోనూ చర్చించి ఖరారు చేసిన రేట్ కార్డ్‌లు అతి త్వరలో అన్ని నిర్మాణ సంస్థలకు అందజేయబడతాయి.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version