Homeసినిమా వార్తలుపోన్నియిన్ సెల్వన్ పై భారీ అంచనాలు పెట్టుకున్న తమిళ ఇండస్ట్రీ

పోన్నియిన్ సెల్వన్ పై భారీ అంచనాలు పెట్టుకున్న తమిళ ఇండస్ట్రీ

- Advertisement -

సౌత్ ఇండియన్ లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన భారీ బడ్జెట్ సినిమా పొన్నియిన్ సెల్వన్ సినిమా విడుదలకు ఇంకా ఒక వారం కంటే తక్కువ సమయం ఉంది, ఈ చిత్రం పట్ల హైప్ మరియు అంచనాలు అసాధారణంగా ఉన్నాయి. ఈ చిత్రం కోసం ప్రేక్షకులలో విపరీతమైన ఆసక్తి నెలకొంది. పైగా సినిమా యొక్క నేపథ్యం, భారీ తత్వం వల్ల ఒక ఎపిక్ సినిమా చూడబోతున్నాము అనే భావన సినీ అభిమానులను ఆకర్షిస్తుంది.

అంతే కాదు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అనే విషయం కూడా అవడం వల్ల పొన్నియిన్ సెల్వన్ సినిమా పై మరింత క్రేజ్ ని పెంచింది. భారత్ దేశంతో పాటు ఓవర్సీస్‌లోనూ అడ్వాన్స్ బుకింగ్‌లు అద్భుతంగా ఉన్నాయి. ఈ చిత్రం యొక్క ప్రీ-సేల్స్ అన్ని భాషలకు కలుపుకుని చూసుకుంటే చాలా బాగున్నాయి, ఇక కేవలం తమిళ వెర్షన్ సినిమా వరకు చూసుకుంటే చాలా మంచి నంబర్లను పోస్ట్ చేసింది.

ఇక పొన్నియిన్ సెల్వన్ తమిళ సినిమా పరిశ్రమలో ఉన్న అన్ని రికార్డులను బద్దలు కొట్టి ఇండస్ట్రీ హిట్ అవుతుందని తమిళ ట్రేడ్ వర్గాలు ఆశిస్తున్నాయి. ఇటీవలే కమల్ హాసన్ – లోకేష్ కనగరాజ్ ల కాంబినేషన్లో వచ్చిన విక్రమ్ సినిమా తమిళనాట ఆల్-టైమ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచి ఇప్పటివరకూ ఉన్న అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. మరి ఇప్పుడు ఈ రికార్డును భారీ హైప్ తో వస్తున్న పొన్నియిన్ సెల్వన్ బద్దలు కొడుతుందని ట్రేడ్ వర్గం భావిస్తోంది.

READ  పొన్నియన్ సెల్వన్ (PS-1) ఆడియో లాంచ్ కు ముఖ్య అతిథులుగా రానున్న రనీకాంత్-కమల్ హాసన్

అయితే విక్రమ్ సినిమా గ్రాస్ ను దాటాలి అంటే పొన్నియిన్ సెల్వన్‌కి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన మౌత్ టాక్ వస్తేనే అది సాధ్య పడుతుంది. విక్రమ్ కలెక్షన్స్ ని దాటాలి అంటే మంచి లాంగ్ రన్ కావాలి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

వచ్చే వారం సెప్టెంబర్ 30న పొన్నియిన్ సెల్వన్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో ఐశ్వర్యరాయ్ బచ్చన్, త్రిష, కార్తీ, చియాన్ విక్రమ్, జయం రవి, ఐశ్వర్య లక్ష్మి, శోభితా ధూళిపాళ, జయరామ్, ప్రకాష్ రాజ్ మరియు మరికొంత మందితో కూడిన భారీ తారాగణం ఉంది. జాతీయ అవార్డు గ్రహీత సినిమాటోగ్రాఫర్ రవి వర్మన్ కెమెరా బాధ్యతను తీసుకోగా.. ఇక ఏ ఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చారు.

Follow on Google News Follow on Whatsapp

READ  తొలి రోజే డిజాస్టర్లుగా నిలిచిన ఈ వారం సినిమాలు


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories