సౌత్ ఇండియన్ లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ప్రతిష్టాత్మక చిత్రం పొన్నియిన్ సెల్వన్ సెప్టెంబర్ 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద భారీ స్థాయిలో ఓపెనింగ్స్ సాధించింది బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న తరుణంలో తమిళ పరిశ్రమలోని స్టార్ హీరోలు ఈ చిత్రం పై మౌనం పాటించడం వెనుక కారణం ఏమిటనే ప్రశ్న అందరిలోనూ మెదులుతుంది.
ఎలాగైతే ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి తెలుగు చిత్ర పరిశ్రమకు గర్వకారణమో, మణిరత్నం తీసిన పొన్నియిన్ సెల్వన్ కూడా తమిళ చిత్ర పరిశ్రమకు అంతే గర్వకారణం. బాహుబలి విడుదలకు ముందు తెలుగు సినీ పరిశ్రమలో భారీ హైప్ తో పాటు ఉత్సుకత ఉండింది. ఇలా విడుదల తర్వాత కూడా అదే స్థాయిలో పొగడ్తలు మరియు ప్రశంసల జల్లులు కురిశాయి.
ఇక పొన్నియన్ సెల్వన్ విడుదలకు ముందు అయితే ఇండస్ట్రీలో చాలా హైప్ వచ్చింది. తమిళ పరిశ్రమలోని నటీనటులు ఇది తమకు గర్వకారణం అంటూ సినిమాకు మద్దతు పలికారు. అయితే రిలీజ్ తర్వాత తమిళ స్టార్ హీరోలు, దర్శకులు, ఇండస్ట్రీ సభ్యులు ఎవరూ సినిమాను ప్రశంసించేందుకు ముందుకు రాకపోవడం గమనార్హం.
కొంత మంది సభ్యులు మినహా, చాలా మంది తమిళ పరిశ్రమ వ్యక్తులు ఈ చిత్రం గురించి ఏ రకంగా కూడా స్పందించలేదు. బాహుబలి విడుదలయ్యాక యావత్ భారత దేశం ఆ సినిమాపై ప్రశంసల జల్లులు కురిపించింది. తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రమే కాకుండా ఇతర సినీ పరిశ్రమల మద్దతు కూడా లభించింది.
పొన్నియిన్ సెల్వన్ విషయంలో మాత్రం అలా జరగలేదు. తమిళ ఇండస్ట్రీ నుంచి ఈ సినిమా విడుదలైన తర్వాత ఎలాంటి మద్దతు కానీ, ప్రశంసలు కానీ రాలేదు. బాక్స్ ఆఫీసు వద్ద ఈ సినిమా కలెక్షన్లు తమిళ ప్రాంతాల్లో సంచలనం సృష్టించి ఆల్ టైమ్ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది.
కానీ తమిళ సినిమా పరిశ్రమ నుంచి ఈ మౌనం చూస్తుంటే మణిరత్నం తమిళ ఇండస్ట్రీని మెప్పించడంలో విఫలమైనట్లు కనిపిస్తోంది. మరి వచ్చే సంవత్సరం రానున్న పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2తో అయినా.. మణిరత్నం తమిళ సినిమా పరిశ్రమను మెప్పించి మరింత ప్రభావితం చేయగలడని ఆశిద్దాం.