తమిళ ఇండస్ట్రీలో హీరో విజయ్ కి ఉన్న స్టార్ డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం తమిళ పరిశ్రమకి మాత్రమే పరిమితం కాకుండా తెలుగు సినిమా పరిశ్రమలోనూ తన సినిమాలు డబ్బింగ్ చేస్తూ తనకంటూ ఒక మార్కెట్ ను సృష్టించుకున్నారు. దక్షిణాది సినిమా పరిశ్రమలలో సూపర్ స్టార్ లలో ఒకరిగా చలామణి అవుతున్నారు. ఇక పారితోషికం విషయంలోనూ విజయ్ కి భారీ పైకం ముడుతుంది. తమిళ పరిశ్రమలో ప్రస్తుతం ఆయనే నంబర్ వన్ స్థానంలో ఉన్న హీరో అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
విజయ్ ఎలాంటి సినిమా చేసినా తమిళ నాట కలెక్షన్లకు ఏమాత్రం కొదవ ఉండదు. ఓవర్సీస్ మార్కెట్ లోనూ రజినీకాంత్ తరువాత తమిళ హీరోల్లో విజయ్ రెండవ స్థానంలో ఉంటారు. ప్రస్తుతం ఆయన వారసుడు/వరిసు అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో అయన తెలుగులో భారీ విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఈ చిత్రానికి దర్శకుడు మరియు నిర్మాతలు మన తెలుగు వారైన దిల్ రాజు, వంశీ పైడిపల్లి కాబట్టి.
తెలుగు.. తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానున్న ఈ సినిమాని సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా విజయ్ చెన్నైలో మరో కొత్త ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. చెన్నై నగరంలోని ఖరీదైన ప్రాంతాల్లో లగ్జరీ అపార్ట్మంట్ ఒకటి కొనుగోలు చేశాడట. దాదాపు 35 కోట్ల ఖరీదైన ధరకు విజయ్ కొత్త ఇల్లు కొన్నారట.
ప్రస్తుతం విజయ్ చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్ గల సొంత ఇంటిలో ఉంటున్నారు. కుటుంబంతో కలిసి ఈ ఇంట్లో ఉంటున్న విజయ్ ఇల్లు మారడానికి కారణం మరేమిటో కాదు. ఆయన ప్రస్తుతం ఉంటున్న వీధిలో రద్దీ బాగా పెరిగిపోవడంతో కాస్త తక్కువ జన సంచారం ఉండే చోటుకి మారాలని నిర్ణయించికున్నట్లు సమాచారం.
పాత ఇల్లు లాగే కొత్త ఇంటిలో కూడా ఆఫీస్ సౌకర్యం కూడా ఉంటుందట. స్టోరీ డిస్కషన్స్ కి సంబంధించి ప్రత్యేకంగా ఓ సపరేట్ రూమ్ సైతం ఉన్నట్లు సమాచారం. ఇక తన పాత ఇంటిని తన రాజకీయ పార్టీకి సంభందించిన కార్యాలయంగా మార్చనున్నట్లు తెలుస్తోంది.