విక్టరీ వెంకటేష్ హీరోగా యువ దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో సైంధవ్ అన్న సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కాగాఏప్రిల్ మొదటి వారం నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌తో అద్భుతమైన బజ్ క్రియేట్ చేసింది. ఇక తాజాగా వినిపిస్తున్న నివేదికల ప్రకారం, ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం నిర్మాతలు తమిళ హీరో ఆర్యని సంప్రదిస్తున్నారని తెలుస్తోంది.
నటుడిగా హీరో ఆర్యకు అద్భుతమైన ఇమేజ్ ఉంది, కేవలం పాజిటివ్ రోల్స్ కాకుండా విశాల్ తో ఎనిమీ వంటి సినిమాలో నెగెటివ్ రోల్స్‌లో కూడా తనదైన నటనతో మెప్పించారు. అల్లు అర్జున్ యొక్క వరుడు (2010)లో కూడా ప్రేక్షకులు తనని ప్రధాన విలన్ పాత్రలో చూసారు. ఇక ఇప్పుడు వెంకటేష్‌కి వ్యతిరేకంగా ఆర్యని చూడటం ఖచ్చితంగా ప్రేక్షకులకు చాలా ఆసక్తికరంగా ఉంటుంది మరియు వారికి ఈ కలయిక బాగా నచ్చుతుంది.
ఈ చిత్రానికి రచన మరియు దర్శకత్వం HIT ఫ్రాంచైజ్ డైరెక్టర్ శైలేష్ కోను నిర్వహించనున్నారు మరియు నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి నిర్మించారు. సైంధవ్ చిత్రం యొక్క ఫస్ట్ గ్లింప్స్ లో వెంకటేష్ తను చివరిగా నటించిన ఎంటర్టైనర్ F3: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్‌లోని కామెడీ లుక్ కి పూర్తి భిన్నంగా అవతార్‌లో కనిపించారు.
గడ్డం, చేతుల్లో తుపాకీ పట్టుకుని, అలాగే మందు(medicine) తో చంద్రప్రస్థ అనే నగరంలోకి అడుగుపెట్టిన వెంకటేష్‌ని మనం చూస్తాం. పోరాటాలు, పేలుళ్లు మరియు రక్తంతో, సైంధవ్ యొక్క ఫస్ట్ లుక్ అభిమానులకు మరియు ప్రేక్షకులకు సినిమా నుండి ఏమి ఆశించవచ్చో ఒక అంచనాని ఇచ్చింది. ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ 1వ వారం నుంచి ప్రారంభం కానుంది.
వెంకటేష్ నుంచి వస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా ఇదే కావడంతో భారీ స్థాయిలో నిర్మించాలనే సన్నాహాల్లో నిర్మాతలు ఉన్నారు. వారు తమ ప్రయత్నంలో విజయం సాధించాలని కోరుకుంటూ, ఆర్య ఈ చిత్రంలో చేరనున్నారనే వార్త కూడా నిజం కావాలని ఆశిస్తున్నాం.