టాలీవుడ్ స్టార్ యాక్టర్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యువ దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో చేస్తున్న సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర. ఈ మూవీ పై మెగా ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా ఎన్నో అంచనాలు నెలకొని ఉన్నాయి.
ఈ మూవీని గ్రాండ్ లెవెల్లో ప్రతిష్టాత్మకంగా యువి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. వాస్తవానికి మే లో ఆడియన్స్ ముందుకి వస్తుందనుకున్న ఈ మూవీ విజువల్ ఎఫెక్ట్స్ మరింత ఆలస్యం కారణంగా ఈ ఏడాది ద్వితీయర్థములో రిలీజ్ కానున్నట్లు టాక్. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు.
మరోవైపు త్వరలో సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఒక మూవీ చేయనున్నారు మెగాస్టార్. ఇప్పటికే ఈ మూవీ యొక్క అధికారిక ప్రకటన నిర్మాత సాహు గారపాటి అలానే మెగాస్టార్ ఒక కార్యక్రమంలో భాగంగా అందించడం జరిగింది.
తాజాగా ఈ మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ స్క్రిప్ట్ ని దర్శకుడు అనిల్ రావిపూడి పూర్తి చేశారట. అతిత్వరలో సెకండ్ హాఫ్ కూడా పూర్తి చేసి వీలైనంత త్వరలో దీనిని పట్టాలెక్కించి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మ్యాటర్ ఏమిటంటే, ఈ మూవీలో హీరోయిన్ గా టాలెంటెడ్ బ్యూటీ అదితి రావు హైదరి నటించనున్నట్లు టాక్.
త్వరలో ఆమెని కలిసి దర్శకుడు అనిల్ కథ కథనాలు వివరించనున్నారట. కాగా ఈమూవీకి భీమ్స్ సిసిలోరియో సంగీతం సమకూర్చనున్నారు. ఇటీవల తెలుగులో మహాసముద్రం మూవీ చేసారు అదితి.