Home సినిమా వార్తలు SVSC Sequel was there but SVSC సీక్వెల్ ఉంటుందట……కానీ ?

SVSC Sequel was there but SVSC సీక్వెల్ ఉంటుందట……కానీ ?

svsc

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు విక్టరీ వెంకటేష్ క్రేజీ కాంబినేషన్లో వచ్చిన క్లాసికల్ ఫ్యామిలీ యాక్షన్ బ్లాక్ బస్టర్ మూవీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. 2013 జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా భారీ విషయమైతే అందుకుంది. ఇక తాజాగా 12 ఏళ్ల అనంతరం ఈ సినిమాని థియేటర్స్ లో రిలీజ్ చేయగా అది కూడా మంచి కలెక్షన్స్ తో కొనసాగుతోంది. 

ముఖ్యంగా రీ రిలీజ్ లో సినిమాలకు మహేష్ బాబు బాక్సాఫీస్ వద్ద మోత మోగిస్తున్నారు. అటు బిజినెస్ మాన్, పోకిరి, మురారి, వంటి సినిమాలు భారీ విజయాలు రిలీజ్ లో అందుకోగా తాజాగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు కూడా మంచి కలెక్షన్స్ తో కొనసాగుతూ ఉండటం విశేషం. 

అయితే మ్యాటర్ ఏంటంటే త్వరలో ఈ సినిమాకు సంబంధించిన సీక్వెల్ ని తెరకెక్కించేందుకు సిద్దమవుతున్నారట. దానికి సంబంధించి త్వరలో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల స్క్రిప్ట్ వర్క్ ప్రారంభించనున్నారని టాక్. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఈ సినిమాలో మహేష్ బాబు,  వెంకటేష్ కాకుండా ఇద్దరు యువ హీరోలు నటిస్తారని అంటున్నారు. 

పార్ట్ 1 ని మించి దీన్ని మరింత ఇంట్రెస్టింగ్ ఫ్యామిలీ యాక్షన్ ఎలిమెంట్స్ తో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల సిద్ధం చేయనున్నారట. త్వరలో ఈ క్రేజీ కాంబినేషన్ మూవీకి సంబంధించి పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడవుతాయని, అలానే ఒనిర్మాత దిల్ రాజునే ఈ మూవీని కూడా నిర్మించనున్నారట. ఇతర నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలు కూడా వెల్లడి కానున్నాయని చెప్తున్నారు. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మరి కొద్దిరోజుల వరకు వెయిట్ చేయకు తప్పదు.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version