తమిళ స్టార్ హీరో సూర్యకు నటుడిగా ఎంత మంచి పెరుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత కొన్నేళ్లగా ఆయన తన స్థాయికి తగ్గ విజయాన్ని అందుకోలేక పోయినా, ఆయన పై ప్రేక్షకుల్లో మరియు అభిమానుల్లో ఉన్న ఆదరణ ఏ మాత్రం తగ్గలేదని చెప్పవచ్చు.
కాగా కరోనా దాడి వల్ల ఆయన రెండు మంచి సినిమాలు ఓటీటీ లో విడుదల చేయాల్సి వచ్చింది. 2020లో సురరై పోట్రు (తెలుగులో జై భీమ్), 2021 లో జై భీమ్. ఈ రెండు చిత్రాలు ఓటిటి లో విడుదలైనా కూడా ప్రేక్షకుల నుండి ఎంతగానో ఆదరణను పొందాయి. ముఖ్యంగా సురరై పోట్రు సినిమా అయితే అమెజాన్ ప్రైమ్ లో రికార్డు వ్యూయర్ షిప్ నమోదు చేసింది.
అక్కడితో ఆగకుండా మరెంతో కీర్తి వంతమైన పేరు ప్రఖ్యాతలు కూడా మూత గట్టుకుంది. ఇటివలే ప్రకటించిన నేషనల్ అవార్డులలో ఏకంగా ఐదు అవార్డులను సొంతం చేసుకోవడం విశేషం. ఉత్తమ నటుడుగా సూర్య అవార్డు అందుకుంటే ఉత్తమ నటిగా అపర్ణా బాలమురళి అవార్డును గెలుచుకున్నారు. ఇవే కాకుండా ఉత్తమ చిత్రం, ఉతమ స్క్రీన్ ప్లే మరియు ఉత్తమ దర్శకుడు క్యాటగిరిలో కూడా అవార్డును గెలుచుకుంది సూరరై పొట్రు.. మొత్తంగా ఐదు అవార్డులను గెలుచుకోవడం విశేషం.
ఇక గత ఏడాది మరో ఓటిటి సినిమాతో ఎనలేని గౌరవాన్ని సొంతం చేసుకున్నారు సూర్య. అదే జై భీమ్ సినిమా. యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఆ సినిమాకు ప్రశంసల జల్లులు కురిశాయి. ఆ ప్రవాహం అక్కడితో ఆగకుండా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయ చిత్ర జెండాని ఎగరవేయబోతుంది జై భీమ్ చిత్రం.
ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ లో నాలుగు అవార్డులకు జై భీమ్ ఎంపికైంది. ఉత్తమ నటుడు (సూర్య), ఉత్తమ నటి (లిజోమొల్ జోస్) , ఉత్తమ దర్శకుడు (జ్ఞాన వేల్)మరియు ఉత్తమ చిత్రం అవార్డులకు గానూ ఈ చిత్రం ఎంపికైంది.
ఇటివలే విక్రమ్ సినిమాలో చివరి నిమిషంలో వచ్చిన రోలెక్స్ పాత్రతో అందరినీ ఆకట్టుకున్నారు సూర్య. భాషలకు అతీతంగా ఆ చిన్న గ్లింప్స్ అందరినీ అలరించగా.. సూర్య అభిమానులైతే ఆనందంతో పిచ్చెక్కి పోయారు. ఇక సూర్య చేయ బోయే తదుపరి చిత్రాలు కూడా ఆసక్తికరమైన కాంబినేషన్లే. అందులో ఒకటి తనకు కెరీర్ లో నిలిచిపోయే పాత్ర మరియు సినిమా అయిన నందా దర్శకుడు బాలాతో అయితే.. మరో సినిమా విలక్షణమైన కథలతో సినిమాలు చేసే వెట్రిమారన్ తో మరో సినిమా (Vaadivasal) చేయబోతున్నారు సూర్య.