ఇటీవల విడుదల అయిన సామ్రాట్ పృథ్వీరాజ్ చిత్రం సక్సెస్ తో మంచి ఊపు మీదున్న అక్షయ్ కుమార్, తన తదుపరి చిత్రం సూర్య నటించిన సూరరై పొట్రు రీమేక్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.ఈ చిత్రాన్ని ప్రకటించినప్పటి నుండి ఇందులో సూర్య అతిధి పాత్రలో కనిపిస్తారు అని గట్టి ప్రచారమే జరిగింది. ఇప్పుడు ఆ విషయాన్ని స్వయంగా సూర్య తన ఇన్స్తాగ్రామ్ లో వెల్లడించారు.
సూర్య, అక్షయ్ కుమార్ కలిసి ఉన్న పిక్ ను షేర్ చేస్తూ సూర్య తన ఆనందాన్ని పంచుకున్నారు. తన పాత్రలో అక్షయ్ కుమార్ ను చూడబోతుండటం చాలా ఆనందంగా ఉందనీ, సుధ కొంగర మరోసారి అదే కధను సజీవంగా తెరకెక్కించగలదు అని సూర్య అన్నారు. ఆ వెంటనే ఆ పోస్ట్ కి రిప్లై గా అక్షయ్ కుమార్ స్పందించారు. సూరరై పోట్రు లాంటి స్ఫూర్తి దాయకమైన సినిమాలో నటించడం చాలా ఆనందంగా ఉందనీ, కెప్టెన్ సుధ కొంగర ఆధ్వర్యం లో చెన్నై లో షూటింగ్ జరుగుతుందని సెలవిచ్చారు.
2020 లో ఓటీటీ లో విడుదల అయిన సూరరై పొట్రు విమర్శకులతో పాటు ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఈ చిత్రంలో సూర్య మాజీ ఎయిర్ ఫోర్స్ అధికారి నేదుమారన్ రాజంగం (మారా)గా కనిపించారు.
తమిళ చిత్రానికి దర్శకత్వం వహించిన సుధ కొంగర ఇప్పుడు హిందీ రీమేక్ భాధ్యత కూడా తీసుకున్నారు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ సరసన రాధికా మదన్ నటిస్తుండగా, పరేష్ రావల్ కూడా ఒరిజినల్ లో చేసిన పాత్రలో మళ్ళీ నటించనున్నారు. ఏప్రిల్ లో షూటింగ్ మొదలైన ఈ చిత్రం విడుదల తేదీ ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు.