కోలీవుడ్ స్టార్ నటుడు సూర్య ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రెట్రో మూవీ చేస్తున్నారు. ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా త్వరలో ఈ మూవీ రిలీజ్ కానుంది. దీని అనంతరం తన కెరీర్ 45 మూవీని ఆర్జే బాలాజీ తో చేయనున్నారు సూర్య.
ఈ రెండు సినిమాలపై సూర్య ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. అయితే విషయం ఏమిటంటే ఎన్నో ఏళ్ల క్రితం రక్త చరిత్ర సినిమా ద్వారా డైరెక్ట్ తెలుగులో మూవీ చేసిన సూర్య మళ్లీ ఎన్నో ఏళ్ళ అనంతరం తాజాగా డైరెక్ట్ తెలుగు మూవీకి పచ్చ జండా ఊపినట్లు తెలుస్తోంది.
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్న ఈ మూవీకి ఇటీవల లక్కీ భాస్కర్ మూవీతో పెద్ద విజయం అందుకున్న వెంకీ అట్లూరి దర్శకత్వం వహించుకున్నట్లు తెలుస్తోంది. రిలీజ్ అనంతరం ఇటీవల రిలీజ్ అయిన లక్కీ భాస్కర మూవీ రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ అందుకుంది.
ఇక సూర్య, వెంకీ ల కాంబినేషన్లో రానున్న మూవీ మరింతగా ఆకట్టుకొని అందర్నీ అలరిస్తుందని మూవీ టీమ్ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. త్వరలో దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రానుంది