Home సినిమా వార్తలు Kanguva Pre Release Business మైండ్ బ్లోయింగ్ రేంజ్ లో సూర్య ‘కంగువ’ ప్రీ రిలీజ్...

Kanguva Pre Release Business మైండ్ బ్లోయింగ్ రేంజ్ లో సూర్య ‘కంగువ’ ప్రీ రిలీజ్ బిజినెస్

kanguva

కోలీవుడ్ స్టార్ యాక్టర్ సూర్య హీరోగా సిరుత్తై శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ ఫాంటసి యాక్షన్ ఎంటెర్టైనర్ మూవీ కంగువ. ఈ మూవీని యువి క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నాయి. బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ నెగటివ్ రోల్ చేస్తున్నారు.

మొదటి నుండి అందరిలో భారీ అంచనాలు కలిగిన కంగువ నుండి ఇటీవల రిలీజ్ అయిన ఫైర్ సాంగ్ శ్రోతలను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై మరింతగా అంచనాలు ఏర్పరిచింది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీని అక్టోబర్ 10న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు. విషయం ఏమిటంటే, కంగువ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగింది.

ముందుగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 25 కోట్లు, కేరళలో రూ. 10 కోట్లతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడ భారీ ధరలకు అమ్ముడైంది. ఇక ఈ మూవీ యొక్క డిజిటల్ రైట్స్ ని ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ వారు రూ. 80 కోట్లకు కొనుగోలు చేసారు. మొత్తంగా అంతా కలిపి కంగువ మూవీ రూ. 350 కోట్ల మేర ప్రీ బిజినెస్ చేసిందని, మూవీకి మంచి టాక్ వస్తే భారీ స్థాయిలో కలెక్షన్ లభించే అవకాశం ఉందని అంటున్నాయి సినీ వర్గాలు.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version