తమిళ హీరో సూర్య గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. కేవలం కమర్షియల్ అంశాల పై ఆధార పడకుండా వైవిధ్యమైన పాత్రలు చేసే హీరోగా సూర్యకు చక్కని పేరు ఉంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఆయన సినిమాలకు మంచి మార్కెట్ ఉంది. అందుకనే హీరో సూర్య తన సినిమాలను ఏక కాలంతో తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తుంటారు.కొంత కాలంగా సూర్యకు బాక్స్ ఆఫీసు వద్ద సరైన విజయం సాధించిన సినిమా లేదు.
అయితే రెండేళ్ళ క్రితం ఓటీటిలో విడుదల అయిన సూరరై పొట్రు సినిమాకి ప్రశంసల వర్షం కురిపించారు ప్రేక్షకులు. అలాగే గత ఏడాది విడుదలైన జై భీమ్ కూడా మంచి పేరు తెచ్చుకున్న చిత్రంగా నిలచింది.అయితే ఈ రెండూ ఓటిటిలో విడుదల కావడం,థియేటర్ల విడుదలైన ఈటీ మాత్రం నిరాశ పరిచింది. అయితే ప్రస్తుతం ఆయన తమిళ పరిశ్రమలో మంచి అభిరుచి గల దర్శకులుగా పేరున్న వెట్రిమారన్, బాలాతో పని చేస్తున్నారు అవి తప్పకుండా విజయం సాధిస్తాయని ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు.ఇదిలా ఉండగా ఒక అరుదైన గౌరవం దక్కింది.
ఇంతకీ సూర్యకు దక్కిన సదరు అరుదైన గౌరవం ఏంటి అంటే ప్రముఖ అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (Academy of Motion Picture Arts and Sciences) నుంచి పిలుపు అందుకున్నారు సూర్య. గత ఏడాది సూర్య నటించిన జై భీమ్ సినిమా నేరుగా ఓటీటీలోనే విడుదలై ఘన విజయాన్ని దక్కించుకుంది. ఈ సినిమాకుగానూ ఆయనకు అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఆహ్వానం అందింది. ఇలా ఈ అకాడమీ నుంచి ఆహ్వానం అందుకున్న తొలి దక్షిణాది నటుడు సూర్య మాత్రమే. ఇది ఖచ్చితంగా ఆయన అభిమానులతో పాటు యావత్ ప్రపంచంలో ఉన్న సినీ ప్రేక్షకుకు గర్వ కారణం అని చెప్పడం అతిశయోక్తి కాదు.