సూర్య 42 అనే పాన్ ఇండియా మూవీ, సిరుతై శివ దర్శకత్వంలో రూపొందుతోంది. కాగా 3డి, 2డి టెక్నాలజీలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన హిందీ శాటిలైట్, థియేట్రికల్, డిజిటల్ అన్నీ కలుపుకుని మొత్తంగా హిందీ హక్కులు 100 కోట్లకు అమ్ముడయ్యాయట. కాగా ఈ చిత్రం యొక్క ఇతర భాషల హక్కుల కోసం కూడా భారీ డిమాండ్ ఉందని సమాచారం.
‘శౌర్యం’, ‘సిరుతై’, ‘వీరం’, ‘వేదాళం’, ‘విశ్వాసం’ వంటి బ్లాక్ బస్టర్స్ అందించిన శివ తొలిసారి సూర్యతో సినిమా చేస్తున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రాన్ని 3డిలో షూట్ చేసి ఏకంగా10 భాషల్లో విడుదల చేస్తామని సెప్టెంబర్ లో చిత్ర యూనిట్ ప్రకటించింది.
ఈ చిత్రంలో దిశా పటానీ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రధానంగా పునర్జన్మ ఆధారిత యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కనుంది. ఇప్పటికే చిత్రీకరణలో ఎక్కువ భాగం పూర్తి కాగా, ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం యొక్క తదుపరి షెడ్యూల్ ఈ ఏడాది మార్చి నాటికి చిత్రీకరించి సూర్య 42 కి ముగింపు పలకాలని శివ మరియు చిత్ర బృందం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
హిందీ చిత్ర నిర్మాత డాక్టర్ జయంతిలాల్ గడా ఈ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ యొక్క హిందీ హక్కులను భారీ మొత్తానికి సొంతం చేసుకున్నారట. సూర్య 42 సినిమా హిందీ హక్కులను జయంతిలాల్ గడా (పెన్ స్టూడియోస్) రూ.100 కోట్లకు సొంతం చేసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
ఇప్పటి వరకు హిందీలో సూర్య సినిమాకు ఇదే అతి పెద్ద డీల్. ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు, అలాగే సినిమా యొక్క వ్యాపారం మరియు ప్రమోషన్లు కూడా అదే విధంగా ఉంటాయి.
పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కుతున్న సూర్య 42 సినిమాలో సూర్య పూర్తిగా కొత్త అవతారంలో కనిపించనున్నారు. దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రం బహుళ భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది.