కోలీవుడ్ స్టార్ యాక్టర్ సూర్య హీరోగా అందాల కథానాయిక పూజా హెగ్డే హీరోయిన్ గా యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రెట్రో.
ఈ మూవీని శక్తీ ఫిలిం ఫ్యాక్టరీ సంస్థ పై కార్తేకేయన్, సంతానం కళ్యాణ్ సుబ్రమణియన్, జ్యోతిక, సూర్య కలిసి గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ టీజర్ ఇటీవల తమిళ్ లో రిలీజ్ అయి అందరినీ ఆకట్టుకుంది.
ఇప్పటికే చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ఈ మూవీలో సూర్య పవర్ఫుల్ పాత్రలో నటిస్తుండగా ఇతర కీలక పాత్రల్లో జయరాం, జాజు జార్జి, నాజర్, ప్రకాష్ రాజ్, తారక్ పొన్నప్ప తదితరులు నటిస్తున్నారు. విషయం ఏమిటంటే, నేడు ఈ మూవీ యొక్క తెలుగు వర్షన్ టీజర్ ని రిలీజ్ చేసారు మేకర్స్.
సూర్య స్టైలిష్ లుక్, మాస్ యాక్షన్ లవ్ అంశాలు టీజర్ నో ఎంతో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు శ్రేయాస్ కృష్ణ తీసిన విజువల్స్ కూడా అలరించి రెట్రో మూవీ పై తెలుగు ఆడియన్స్ లో కూడా మంచి ఆసక్తిని ఏర్పరిచాయి. అన్ని కార్యక్రమాలు ముగించి ఈ మూవీని మే 1న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.