Homeసినిమా వార్తలుహీరో బాలకృష్ణ - దర్శకుడు గుణశేఖర్ లకు సుప్రీం కోర్టు నోటీసులు

హీరో బాలకృష్ణ – దర్శకుడు గుణశేఖర్ లకు సుప్రీం కోర్టు నోటీసులు

- Advertisement -

నందమూరి బాలకృష్ణ నటించిన సినిమాకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయన హీరోగా నటించిన వందవ చిత్రం అయిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమాకి పన్ను రాయితీ తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం వద్ద నుంచి పన్ను రాయితీ తీసుకున్న తరువాత కూడా ఆ చిత్రానికి ధియేటర్లలో టికెట్ రేటు తగ్గించలేదని సినీ వినియోగదారుల సంఘం పిటిషన్ దాఖలు చేసింది. పన్ను రాయితీ ప్రయోజనాలను ప్రేక్షకులకు బదలాయించలేదని కోర్టు వెల్లడించింది.

ఈ మేరకు హీరో బాలకృష్ణ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ నిర్మాతలతో పాటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు సహా ప్రతివాదులందరికీ సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. మరో వైపు.. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ప్రతిష్టాత్మక చిత్రం ‘రుద్రమదేవి’కి కూడా నోటీసులు జారీ అయ్యాయి. ఈ రెండూ చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలు కావడం వల్ల అప్పటి టీడీపీ ప్రభుత్వం పన్ను రాయితీ ఇచ్చింది.

అయితే పన్ను రాయితీ పొందిన డబ్బు మొత్తాన్ని తిరిగి ప్రభుత్వానికి రికవరీ చేయాల్సిందిగా పిటిషన్‌లో కోర్టు విజ్ఞప్తి చేసింది. ఈ కేసు విచారించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి. వై.చంద్ర చూడ్ ధర్మాసనం.. మొత్తం వ్యవహారం పై సరైన వివరణ ఇవ్వాల్సిందిగా సినీ నటుడు బాలకృష్ణ, సహా ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది.

READ  మారుతి తో సినిమా పై ఆందోళనలో ఉన్న ప్రభాస్ అభిమానులు

గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమా బాలకృష్ణ కెరీర్‌లో 100వ సినిమాగా తెరకెక్కింది. మహారాజు శాతకర్ణి జీవితం ఆధారంగా తీసిన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి చక్కని స్పందనను సొంతం చేసుకుని ఆకట్టుకుంది. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ తనదైన శైలిలో వెండితెర పై చూపించారు. హేమమాలిని, శ్రియ కీలక పాత్రల్లో నటించారు. 2017 జనవరిలో బాక్సాఫీసు ముందుకు వచ్చిన ఈ చిత్రానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వాలు పన్ను రాయితీ ఇచ్చాయి.

ఇక, రుద్రమదేవి విషయానికి వస్తే.. అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని గుణశేఖర్ తెరకెక్కిచ్చారు. కాకతీయ వీరనారి రుద్రమదేవి జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. కృష్ణంరాజు, అల్లు అర్జున్, రానా, ప్రకాష్ రాజ్.. ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు. అయితే 2015లో విడుదలైన ఈ చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం పన్ను రాయితీ ఇచ్చింది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మాత్రం పన్ను రాయితీ ఇవ్వలేదు. ఈ క్రమంలోనే గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రానికి ఆంధ్రా ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇచ్చిన సమయంలో.. రుద్రమదేవి చిత్రానికి పన్ను మినహాయింపు ఇవ్వకపోవడం పై ఆవేదన వ్యక్తం చేస్తూ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు గుణశేఖర్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆ లేఖ పెద్ద దుమారాన్నే రేపింది.

READ  Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు విషజ్వరం

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories