Homeసినిమా వార్తలుసూపర్‌స్టార్ రజినీకాంత్‌ పుట్టిన రోజు సందర్భంగా బాబా సినిమా రీ-రిలీజ్

సూపర్‌స్టార్ రజినీకాంత్‌ పుట్టిన రోజు సందర్భంగా బాబా సినిమా రీ-రిలీజ్

- Advertisement -

సూపర్‌స్టార్ రజినీకాంత్‌ కెరీర్ లోనే భారీ ఫ్లాప్‌గా నిలిచినప్పటికీ.. ఆయన జీవితంలో బాబా సినిమా చాలా ముఖ్యమైనది అని చెప్పచ్చు. ఈ చిత్రాన్ని స్వయంగా రజినీకాంత్ రాశారు. ఆయన ఈ సినిమాని ఎన్నో రోజులుగా కలగన్ని తీశారు. కాగా ఈ సినిమాలో జీవితం గురించి తన తత్వాన్ని చెప్పడానికి ప్రయత్నించారు.

ఇక వచ్చే నెల ఆయన పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 12న ఈ చిత్రాన్ని మళ్లీ విడుదల చేస్తున్నారు. బాబాలో రజనీని చూడాలని మరియు ఈ ఆధ్యాత్మిక చిత్రాన్ని థియేటర్లలో అనుభవించాలని అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. థియేట‌ర్ల‌లో మిస్స‌యిన ప్ర‌స్తుత తరానికి మ‌ళ్లీ చూసే అవ‌కాశం కూడా దొరుకుతుంది.

బాషా, అన్నామలై వంటి భారీ బ్లాక్‌బస్టర్‌లను అందించిన సురేష్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. బాబా సుదీర్ఘ విరామం తర్వాత రజనీకాంత్ చేసిన చిత్రం కావడంతో ఆ సమయంలో విడుదలకు ముందే బ్రహ్మాండమైన బజ్ సృష్టించింది. ఎందుకంటే రజినీకాంత్ మళ్లీ సినిమాలు చేస్తాడా అనే సందేహం చాలామందిలో ఉండింది. ఆ నేపథ్యంలో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్న పరిస్థితుల్లో విడుదలైన బాబా సినిమా భారీ పరాజయాన్ని చవి చూసింది.

READ  సూపర్ స్టార్ రజినీకాంత్ నిర్ణయంతో సుముఖంగా లేని అభిమానులు

బాబా సినిమాలో మాస్ మసాలా అంశాలు లేవు కానీ చక్కని హీరోయిజంతో కూడిన ఫిలాసఫికల్ డైలాగ్స్‌తో కొన్ని విజిల్స్ వేయడానికి విలువైన సందర్భాలు ఉన్నాయి. బాబా జీవితం గురించి మంచి జ్ఞానం ఉన్న వ్యక్తి కానీ తన జీవితంలో ఎదీ సాధించకుండా వీధి యుద్ధాలలో మునిగిపోతూ మద్యపానం కూడా చేస్తాడు. అలాంటి మనిషి మనసు మార్చుకుని స్వచ్ఛమైన మనిషిగా ఎలా మారాడు అనేది బాబా సినిమా కథ.

సినిమాలో రజినీకాంత్ నటన ఎంతో సహజంగా ఉంటుంది. బాక్సాఫీస్ లెక్కలు లేకుండా సినిమా కోసం సూపర్‌స్టార్లు తమ హృదయాన్ని మరియు ఆత్మను పెట్టి సినిమాలు తీయడం చాలా అరుదు. ఇలాంటి సినిమాలు అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి.

బాబా కోసం ఏ ఆర్ రెహమాన్ అందించిన సంగీతం ఇప్పటికీ ప్రేక్షకులకి ఆకర్షణీయంగా ఉంటుంది. ముఖ్యంగా బాబా టైటిల్ ర్యాప్ యొక్క బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నేటికీ ప్రేక్షకులచే విశేషమైన ఆదరణ పొందుతుంది.

Follow on Google News Follow on Whatsapp

READ  కొత్త హీరో సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొడుతున్న లవ్ టుడే


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories