ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ చేస్తున్న మాస్ గ్యాంగ్ స్టార్ యాక్షన్ సినిమా కూలీ. ఈ సినిమాలో శృతిహాసన్, ఉపేంద్ర, నాగార్జున, అమీర్ ఖాన్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తుండగా సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు.
ఈ సినిమా ఆగస్టు 14న గ్రాండ్ లెవెల్లో అత్యధిక థియేటర్స్ లో ఆడియన్స్ ముందుకు రానుంది. మరోవైపు దీనితో పాటు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ 2 సినిమా కూడా చేస్తున్నారు రజనీకాంత్. ఈ సినిమా కూడా గ్రాండ్ గా భారీ స్థాయిలో రూపొందుతుంది. అయితే తాజాగా రజనీకాంత్ తో సినిమా చేసేందుకు మరొక యంగ్ డైరెక్టర్ రెడీ అయ్యారు.
ఆయన మరెవరో కాదు ఇటీవల విజయసేతుపతి ప్రధాన పాత్రలో తెరకెక్కిన యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ సినిమా మహారాజా దర్శకుడు నితిలన్. ఆ సినిమా దర్శకుడైన నితిలన్ తాజాగా రజనీకాంత్ కి ఒక అద్భుతమైన స్టోరీ లైన్ వినిపించగా అది ఆయనకు ఎంతో నచ్చిందని, అయితే పూర్తి స్క్రిప్ట్ పూర్తి చేసిన అనంతరం తామిద్దరం కలిసి సినిమా చేద్దామని రజిని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చెప్తున్నారు.
అన్ని అనుకున్నట్టు జరిగితే త్వరలో వీరిద్దరి క్రేజీ కాంబినేషన్ మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందని టాక్. ఇక రజనీకాంత్ ఈ సినిమాలో ఒక విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారని ఇది కూడా ఆకట్టుకునే యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందునుందని సమాచారం.