Homeసినిమా వార్తలుసూపర్ స్టార్ రజినీకాంత్ నిర్ణయంతో సుముఖంగా లేని అభిమానులు

సూపర్ స్టార్ రజినీకాంత్ నిర్ణయంతో సుముఖంగా లేని అభిమానులు

- Advertisement -

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ త్వరలో విడుదల కానున్న లాల్ సలామ్ చిత్రంలో ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌కి దర్శకత్వం వహించేది మరెవరో కాదు, ఆయన కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్. లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై సుభాస్కరన్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రంలో ఇద్దరు యువ తమిళ స్టార్లు విష్ణు విశాల్ మరియు విక్రాంత్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు.

అయితే, సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు ఈ వార్తలతో సంతోషంగా లేరట. ఎందుకంటే అతిధి పాత్రలు చేస్తే తమ అభిమాన హీరో స్టార్‌డమ్ తగ్గుతుందని వారు భావిస్తున్నారు. అభిమానుల భయంలో కాస్త నిజం కూడా లేకపోలేదు. స్టార్ హీరోల అతిధి పాత్రల పట్ల జాగ్రత్త వహించాలి, లేకపోతే అది బలవంతంగా కనిపిస్తుంది మరియు ప్రతికూల వాతావరణం సృష్టిస్తుంది.

గతంలో, తమిళ స్టార్ హీరో సూర్య అతిధి పాత్రలు పోషించడం మరియు సాధ్యమైన ప్రతి వాణిజ్య ప్రకటన చేయడం వల్ల పలు సమస్యలను ఎదుర్కొన్నారు. కొన్ని రోజులు ఆయన స్టార్ ఇమేజ్‌కు భంగం కూడా కలిగింది. అయితే రజనీకాంత్ తన కూతురి డైరెక్షన్‌లో స్పెషల్ రోల్ చేయడం కుటుంబ విషయంగా కనిపించడంతో పాటు ఒక తండ్రిగా కూతురి సినిమాకు హైప్ క్రియేట్ చేయడానికి ఆయన సహకరిస్తున్నారని ప్రేక్షకులకు అర్థమవుతుంది. కాబట్టి, కొంత మంది ప్రేక్షకుల అభిప్రాయం ప్రకారం, ఐశ్వర్య రజనీకాంత్ చిత్రంలో రజనీకాంత్ అతిధి పాత్రలో నటించడం రిస్క్ కాదనే భావన వెలువడుతోంది.

READ  పొన్నియిన్ సెల్వన్ సీక్వెల్ విడుదల ఎప్పుడంటే?

రజనీకాంత్ చివరి సినిమాగా సిరుతై శివ దర్శకత్వంలో వచ్చిన అన్నత్తే (తెలుగులో పెద్దన్న) ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ఆయన నెల్సన్ దర్శకత్వంలో జైలర్ సినిమా చేస్తున్నారు. దర్శకుడు నెల్సన్ కూడా తన మునుపటి చిత్రం బీస్ట్‌తో పరాజయాన్ని ఎదుర్కొన్నారు, ఇందులో తమిళ స్టార్ హీరో విజయ్ ప్రధాన కథానాయకుడిగా నటించారు.

ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య 2012లో ధనుష్ నటించిన 3, మరియు వై రాజా వై చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. స్టంట్ కొరియోగ్రాఫర్‌లను హైలైట్ చేసిన సినిమా వీరన్ అనే డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించడంతో పాటు, ఐశ్వర్య స్టాండింగ్ ఆన్ యాపిల్ బాక్స్: ది స్టోరీ ఆఫ్ ఎ గర్ల్ అమాంగ్ ది స్టార్స్ అనే పుస్తకాన్ని కూడా రాసారు. ఈ సంవత్సరం ప్రారంభంలో, ఆమె తన తొలి బాలీవుడ్ చిత్తం ఓహ్ సాథీ చల్‌ను కూడా ప్రకటించడం జరిగింది.

ఇక హీరో విక్రాంత్.. బక్రీద్, వెన్నిల కబడ్డీ కుజు 2 వంటి చిత్రాల్లో నటిస్తుండగా, విష్ణు విశాల్ చెల్లా అయ్యావు మరియు గట్టు కుస్తి అనే సినిమాలలో కనిపించనున్నారు.

Follow on Google News Follow on Whatsapp

READ  బిల్లా స్పెషల్ షోలలో అపశృతి.. అత్యుత్సాహంతో థియేటర్ తగలబెట్టిన ప్రభాస్ ఫ్యాన్స్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories